నంద్యాల నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం 50రోజులుగా తగ్గని కుడిభుజం నొప్పి, నంద్యాలలో స్కానింగ్ 1300 కి.మీ. అధిగమించిన సందర్భంగా కానాలలో శిలాఫలకం పసుపు మార్కెట్, కోల్డ్ స్టోరేజి ఏర్పాటుకు యువనేత హామీ!
నంద్యాల: యువనేత Nara lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 103వరోజు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా సాగింది. పాదయాత్ర 1300 కి.మీ. మైలురాయిని అధిగమించిన సందర్భంగా నంద్యాల యాతం ఫంక్షన్ హాలు సమీపాన లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక నంద్యాల రూరల్ కానాలలో పసుపు మార్కెట్, కోల్డ్ స్టోరేజి ఏర్పాటుకు యువనేత లోకేష్ హామీ ఇచ్చారు. 50రోజులుగా కుడిభుజంనొప్పితో బాధపడుతున్నప్పటికీ యువనేత లోకేష్ మొక్కవోని పట్టుదలతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. గురువారం డాక్టర్ల సూచనమేరకు నంద్యాల పద్మావతినగర్ లో మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్ లో నారా లోకేష్ కుడి భుజానికి ఏంఆర్ఐ స్కానింగ్ చేయించారు. పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తల తోపులాటలో నారా లోకేష్ కుడి భుజానికి గాయమైంది. అప్పటి నుండి నొప్పితో బాధపడుతూనే లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఫిజియోథెరపీ, డాక్టర్ల సూచన మేరకు జాగ్రతలు తీసుకున్నా నొప్పి తగ్గలేదు. 50 రోజులు దాటిపోయినా నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్ల సూచన మేరకు ఎంఆర్ఐ స్కానింగ్ చేయించారు. ఇదిలావుండగా, గురువారం కానాలలో లోకేష్ పాదయత్ర సందర్భంగా రోడ్లన్నీ జనంతో కిటకిటలాడాయి. యువనేతను చూసేదుకు భారీగా జనం రోడ్లపైకి తరలివచ్చారు. ముస్లిం మైనారిటీలు యువనేతకు స్వాగతం పలికి తమ సమస్యలను విన్నవించారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న యువత, మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, వేసవిలో విద్యుత్ కోతలతో ఇబ్బంది పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. మరో ఏడాది ఓపికపడితే రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు తీరుస్తుందని భరోసా ఇచ్చి లోకేష్ ముందుకు సాగారు. అంతకుముందు యాతం ఫంక్షన్ హాలువద్ద రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన లోకేష్ వారి సమస్యలు తెలుసుకున్నారు. దారిపొడవునా కుందూనది పరీవాహక గ్రామాల ప్రజలు, జాతీయ రహదారి ఎలైన్ మెంట్ మార్పు బాధితులు, వడ్డెరలు, ముస్లింలు యువనేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈరోజు 17.3 కి.మీ. మేర యువనేత పాదయాత్ర కొనసాగింది. ఇప్పటివరకు మొత్తం 1319.1 కి.మీ.ల పాదయాత్ర పూర్తయింది.
రాయలసీమ రైతులపాలిట శని జగన్ రెడ్డి!
ఒక్క ప్రాజెక్టూ పూర్తిచేయకుండా చేశారు అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తిచేసి సాగునీటి కష్టాలు తీరుస్తాం రాయలసీమలో అగ్రికల్చరల్ రీసెర్చి సెంటర్ ఏర్పాటుచేస్తాం ఎరువులు, పురుగుమందుల రేట్లను అదుపులోకి తెస్తాం వ్యవసాయ అనుబంధరంగాలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం
రైతులతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్
నంద్యాల: రాయలసీమ రైతులపాలిట జగన్… ఇక్కడి రైతులకు రైతులకు నీరు అందిస్తే బంగారం పండిస్తారు, రాయలసీమ బిడ్డనని చెబుతూ ఒక్క ప్రాజెక్టు పూర్తిచేయకుండా తీరని ద్రోహం చేస్తున్నాడని టిడిపి యువనేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల యాతం ఫంక్షన్ హాలు వద్ద రైతులతో ముఖాముఖి సమావేశమైన యువనేత వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యువనేత లోకేష్ మాట్లాడుతూ… టిడిపి హయాంలో ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అమ్మాలి అంటే భయపడేవారు. జగనే 420 కాబట్టి ఇప్పుడు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. జగన్ చేతగానితనాన్ని వాతావరణం పై తోసేసి రైతులకు అన్యాయం చేసారు. టిడిపి అధికారంలోకి వచ్చాక రాయలసీమలో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. గత టిడిపి హయాంలో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరిగింది. సేంద్రియ వ్యవసాయం కోసం టిడిపి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థలను వైసిపి నాశనం చేసింది. పెట్టుబడి తగ్గించాలనే ఉద్దేశంతోనే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫ్ఫార్మింగ్ ని ప్రోత్సహించాం. మళ్లీ అధికారంలోకి వచ్చాక విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల రేట్లు తగ్గించి వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. టిడిపి హయాంలో పాడి రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. ఇప్పుడు జగన్ కనీస సాయం అందించడం లేదు. పాడిపరిశ్రమను సైతం పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం.
రైతుల భూములు లాక్కుంటున్నారు!
వైసిపి నాయకులు రైతుల భూములు లాక్కుంటున్నారు. మంత్రి బుగ్గన నియోజకవర్గంలో రైతు రవికి అన్యాయం జరిగితే కనీసం స్పందించలేదు. బుగ్గన అనుచరులే రైతుల పై దౌర్జన్యానికి పాల్పడ్డారు. రవి కి టిడిపి అండగా ఉంటుంది. రాబోయేది టిడిపి ప్రభుత్వమే మీ భూమి మీకు ఇచ్చే బాధ్యత నాది. రైతులను వైసిపి ప్రభుత్వం నిత్యం అవమానపరిస్తుంది. ధాన్యం కొనమని అడిగితే ఎర్రిపప్ప అని తిట్టి రైతులను అవమానించారు ఒక మంత్రి. టిడిపి హయాంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం 11,700 కోట్లు ఖర్చు చేసాం. వైసిపి హయాంలో కనీసం టిడిపి చేసిన దాంట్లో 10 శాతం కూడా ఖర్చు కూడా చెయ్యలేదు. కర్నూలు నుండి వలసలు వెళ్తున్న వ్యవసాయ కూలీలతో మాట్లాడిన తరువాత నాకు బాధ కలిగింది. టిడిపి హయాంలో నీటి ని సమర్థవంతంగా వాడుకోవడం కోసం 7 లక్షల పంట కుంటలు కూడా తవ్వాం. గోదావరి, కృష్ణా , పెన్నా అనుసంధానం ప్రక్రియ ప్రారంబించింది టిడిపి. మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే నదుల అనుసంధానం ప్రక్రియ పూర్తి చేస్తాం. గుండ్రేవుల ప్రాజెక్టు టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తి చేస్తాం.
పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం!
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు అన్ని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తాం. పాలిచ్చే ఆవు వద్దనుకొని తన్నే దున్నపోతు ని తెచ్చుకున్నారు. టిడిపి హయాంలో 50 వేలు లోపు ఉన్న రుణాలు అన్ని ఒక్క సంతకం తో రద్దు చేసాం. భూసార పరీక్షలు మైక్రో నూట్రియెంట్స్, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్స్యూరెన్స్, గిట్టుబాటు ధర, వ్యవసాయ పరికరాలు,రైతు రథాలు అందించాం. జగన్ పాలనలో గిట్టుబాటు ధర లేదు, రూ.3500 ధరల స్థిరీకరణ నిధి అన్నాడు ఆ నిధి ఎక్కడికి పోయింది, ఇన్స్యూరెన్స్ లేదు, రైతు రుణాలు ఇవ్వడం లేదు, వ్యవసాయం చెయ్యడానికి పరికరాలు, యంత్రాలు ఇవ్వడం లేదు. ఎన్నికల ముందు రైతు భరోసా రూ.12,500 ఇస్తాను అని చెప్పి ఇప్పుడు కేవలం రూ.7,500 మాత్రమే ఇస్తున్నారు. ఒక్కో రైతుకి రూ.25 వేలు చేశాడు జగన్. ప్రతి ఏడాది గిట్టుబాటు ధరలు ప్రకటిస్తాం అని హామీ ఇచ్చి చేశాడు జగన్. టిడిపి హయాంలో సబ్సిడీ లో డ్రిప్ ఇరిగేషన్ అందించాం. జగన్ ఏకంగా డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేశాడు. టిడిపి హయాంలో హార్టికల్చర్ కి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాం.
అలగనూరు రిజర్వాయర్ పూర్తిచేస్తాం!
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రిపేర్ వర్క్స్ పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ లో ఏ జోన్ లో ఎటువంటి పంటలు వెయ్యాలో అధ్యయనం చేసి రైతులకు సహకారం అందిస్తాం. బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో వ్యవసాయం పై అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఏపిలో కూడా వ్యవసాయ పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. జగన్ పాలనలో అన్ని హాలిడేలే… క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, ఆక్వా హాలిడే లే మిగిలాయి. టిడిపి హయాంలో నేరుగా ఉపాధి హామీని అనుసంధానం చేసే అవకాశం లేకపోయినా హార్టి కల్చర్, పంట కుంటలు ఇతర అంశాల్లో ఉపాధి హామీ ని అనుసంధానం చేసాం. ఇప్పుడు జగన్ రాయలసీమ రైతుల మెడకి మీటర్ల పేరుతో ఉరి తాడు వేస్తున్నాడు. ఇది గ్యాస్ సబ్సిడీ లాంటిదే. మోటార్ల కు మీటర్లు పెట్టడానికి అంగీకరిస్తే ఇక మీరు నెల నెల బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మీటర్లు బిగించి రైతుల పేరుతో అప్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్. వరి, పత్తి, వేరు శనగ, జొన్న, మిరప, పసుపు, మినుములు వేసే రైతుల కష్టాలు అన్ని నేను తెలుసుకున్నాను. కోల్డ్ స్టోరేజ్ లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చెయ్యడం తో పాటు. పంట అమ్ముకోవడం కోసం మార్కెట్ ఏర్పాటు, గిట్టుబాటు ధర కల్పిస్తాం.
రైతులతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు:
రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పలువురు రైతులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. సాంబశివరావు మాట్లాడుతూ… పత్తి వేసి తీవ్రంగా నష్టపోయాం. కల్తీ విత్తనాల కారణంగా నష్టపోయాం. పైగా ప్రతికూల వాతావరణం వలనే పత్తి దెబ్బతింది అని అధికారులు చెబుతున్నారని వాపోయారు. శ్రీనివాసులు మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయం కోసం ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. డోన్ కి చెందిన రైతు రవి మాట్లాడుతూ… మా పొలాలను ఆక్రమించుకొని మంత్రి బుగ్గన అనుచరులు రోడ్డు వేస్తున్నారు. అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను. మీరు మాకు న్యాయం చేయాలని కోరారు. బాలఈశ్వర రెడ్డి మాట్లాడుతూ… గుండ్రేవుల ప్రాజెక్టు, సిద్దేశ్వరం అలుగు ప్రాజెక్టులు పూర్తి చేస్తే రాయలసీమ నీటి కష్టాలు తీరతాయని చెప్పారు. తులసి రెడ్డి మాట్లాడుతూ… వేరుశనగ రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదు. కనీసం లోన్లు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. శ్రీకాంత్ మాట్లాడుతూ… గ్రీన్ హౌస్, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ రావడం లేదని చెప్పారు. భాస్కర రెడ్డి మాట్లాడుతూ… అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వహణ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
విదేశీ ఉద్యోగాలకి దిక్సూచి టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ -నారా లోకేష్‌ని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన యూఎస్ఏ వెళ్తున్న యువకులు
ఏపీలోని నిరుద్యోగులకి శిక్షణ ఇచ్చి విదేశాలలో ఉద్యోగాలు కల్పించే వేదికగా టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ నిలిచిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశంసించారు. ఎన్ఆర్ఐ టిడిపి ఆధ్వర్యంలో టిడిపి ఎంపవర్ మెంట్ సెంటర్ లో శిక్షణ పూర్తిచేసుకుని యూఎస్ఏ వెళ్తున్న విద్యార్థులు గురువారం నంద్యాల యువగళం పాదయాత్ర క్యాంప్ సైట్ వద్ద నారా లోకేష్‌ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. వీరితోపాటు రవికుమార్ వేమూరు ఎన్ఆర్ఐ టిడిపి, మల్లిక్ మేదరమెట్ల- టిడిపి ఎంపవర్ మెంట్ యూఎస్ఏ కోఆర్డినేటర్, గరిమెళ్ల రాజశేఖర్ ఆర్థోపెడిక్ సర్జన్, విశాఖపట్నం ఉన్నారు. టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకున్న బనగానపల్లెకి చెందిన సురేంద్ర టెక్సాస్ లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఇంటర్న్‌షిప్ చేయడానికి వెళుతున్నారు. అనంతపురానికి చెందిన ఇంతియాజ్ పెన్సిల్వేనియాకి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఇంటర్న్‌షిప్ అవకాశం దక్కించుకున్నారు. విదేశీ అవకాశాలు దక్కించుకున్న యువకులు, ఎన్ఆర్ఐ టిడిపి, టిడిపి ఎంపవర్ మెంట్ నిర్వాహకులను ఈ సందర్భంగా యువనేత నారా లోకేష్ అభినందించారు.
తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ అయిన ఎన్‌ఆర్‌ఐ టిడిపి సెల్ ఆధ్వర్యంలో టిడిపి కేంద్ర కార్యాలయం మంగళగిరిలోని టిడిపి ఎంపవర్ మెంట్ లో కామర్స్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లకు టాలీ కోర్సులో ఉద్యోగ ఆధారిత ఉచిత శిక్షణను గత కొంతకాలంగా అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో వివిధ కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు. అక్కౌంట్స్ లో టాలీ-బుక్ కీపింగ్, సాఫ్ట్‌వేర్ లో జావా, పైథాన్, డేటా అనలిటిక్స్ లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు చూపిస్తున్నారు. యూఎస్ఏలో టీచర్, హోటల్ మేనేజ్‌మెంట్ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. గల్ఫ్‌లో ఎలక్ట్రీషియన్ జాబ్స్ కి పంపిస్తున్నారు. పూర్తి ఉచితంగా శిక్షణ అందించి ట్రైనీలు, అప్రెంటిషిప్, ఇంటర్న్‌షిప్ గా విదేశాలలో యువతకి ఉద్యోగ-ఉపాధి అవకాశాలు చూపిస్తోంది ఎన్ఆర్ఐ టిడిపి.
పల్లెప్రగతిలో నా కృషికి ఆనవాళ్లు..ఈ శిలాఫలకాలు!
నంద్యాల నియోజకవర్గం కానాల గ్రామంలో యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర కొనసాగుతుండగా ఆశ్చర్యకరంగా నేను పంచాయతీరాజ్‌శాఖా మంత్రిగా వేసిన శిలాఫలకాలు కనిపించాయి. మరింత ఆసక్తి పెరిగి, ఈ పనులన్నీ పూర్తయ్యాయో, లేదోనని చూశాను. ప్రతీ అభివృద్ధి పనీ పూర్తయ్యింది. శంకుస్థాపన చేసిన మేమే ప్రారంభోత్సవం కూడా చేశాం. ఇది మా విశ్వసనీయత. ఇదీ తెలుగుదేశం కమిట్మెంట్. పంచాయతీరాజ్ మంత్రిగా నేను పల్లె ప్రగతికి చేసిన కృషికి ఆనవాళ్లు..ఈ శిలాఫలకాలు జగన్ మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి అంటే వంగలేక ఎవరో రాయి తెస్తే దానిపై టెంకాయ కొట్టడం, స్టంప్స్‌పై టెంకాయ కొట్టడం, చంద్రబాబు చేసిన శంకుస్థాపనల్ని ధ్వంసం చేసి ..పేర్లు మార్చి కొత్త శిలాఫలకాలు వేయడం అభివృద్ధి కాదు జగన్ మోహన్ రెడ్డి గారూ అంటూ చురకలు వేశారు.
యువనేతను కలిసిన కానాల రైతునగర్ ప్రజలు
నంద్యాల నియోజకవర్గం కానాల రైతునగర్ వాసులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. 167కె జాతీయ రహదారి నిర్మాణంలో మా పొలాలు పోతాయని గెజిట్ నోటిఫికేషన్ లో బయటపడింది. తర్వాత మేము ఆరా తీయగా అలైన్ మెంట్ విషయంలో అధికారపార్టీ కుట్ర బయటపడింది. ఎమ్మెల్యే శిల్పారవి వారి స్వార్థం కోసం ఎలైన్ మెంట్ మార్పించారని అర్థమైంది. మా ఎమ్మెల్యే శిల్పా రవి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మా ప్రాంతంలో వందల ఎకరాల్లో వెంచర్లు వేశారు. వారి వెంచర్లతోపాటు వారి బంధువులు, బినామీల వెంచర్లు కాపాడుకోవడానికి ఎలైన్ మెంట్ మార్చారు. జాతీయరహదారి నిబంధనల ప్రకారం దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఉన్నపుడు, గ్రామం రెండుగా విడిపోయేటప్పుడు మాత్రమే ఎలైన్ మెంట్ మార్చే అవకాశం ఉంది. నంద్యాల నుంచి జమ్మలమడుగు వెళ్లే రహదారిని అనేక ఒంపులు తిప్పుతూ అధికారపార్టీ నాయకుల వెంచర్లు తాకుతూ వెళ్లేవిధంగా ఎలైన్ మెంట్ మార్చారు. పేదరైతుల నిస్సహాయతను ఆసరాగా చేసుకొని వారి భూములు టార్గెట్ చేస్తూ రహదారి ఎలైన్ మెంట్ మార్చారు. ఒక పథకం ప్రకారమే పెద్దల భూములకు విలువవచ్చే విధంగా ఎలైన్ మెంట్ మార్చారు. ఈ విషయమై మేము జాయింట్ కలెక్టర్ ను కలువగా ఆమె మమ్మల్ని దుర్భాషలాడి బెదిరించారు. అనేక ఆందోళనల తర్వాత మా సమస్యను జాతీయ రహదారి మంత్రిత్వశాఖ, మానవహక్కుల కమిషన్ కు తెలియజేశాము. కేవలం అధికార పార్టీ స్వార్థం కోసం పేదరైతులను ఇబ్బంది పెడుతున్నారు. మా సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి చిన్న, సన్నకారు రైతులమైన మాకు న్యాయం జరిగేలా చూడండి.
రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నేతలు ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ మాఫియాలుగా మారి అడ్డగోలు దోపిడీకి తెగబడుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుబడిని ప్రైవేటు భూములను సైతం బెదిరించి లాక్కుంటున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. జగన్ కు అధికారమిచ్చింది ప్రజలకు మంచిచేయడానికే తప్ప అధికారపార్టీ అడ్డగోలు దోపిడీకి లైసెన్సు ఇవ్వలేదు. 167కె జాతీయ రహదారి నిర్మాణంలో ఎలైన్ మెంట్ మార్పులపై కేంద్రానికి లేఖరాస్తాం. భూమిపైనే ఆధారపడిన పేదరైతులకు అండగా నిలచి, వారికి న్యాయం జరిగేలా చూస్తాం.
లోకేష్ ను కలిసిన కానాల గ్రామ ముస్లిం మైనారిటీలు
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం కానాల గ్రామ ముస్లిం మైనారిటీలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామానికి 2018లో టిడిపి హయాంలో షాదీఖానాకు రూ.50లక్షలు మంజూరు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నిధులను నిలిపేసింది. మీరు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ నిధులను విడుదల చేయాలి. మా గ్రామంలోని జామియా మసీదు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది. అందులో సామాన్లు కూడా కాలిపోయాయి. మసీదు కూడా పాక్షికంగా దెబ్బతింది. మసీదు పునర్నిర్మాణంతోపాటు, అందులో సామాన్లు కొనుగోలుకు నిధులు మంజూరు చేయాలి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనారిటీలపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. మైనారిటీల కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దుల్హాన్, రంజాన్, విదేశీ విద్య వంటి పథకాలను రద్దుచేసింది. మైనారిటీల కోసం ఖర్చుచేయాల్సిన రూ.5,400 కోట్ల సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించింది. రాష్ట్రవ్యాప్తంగా వేలకోట్ల వక్ఫ్ బోర్డు ఆస్తులను వైసిపి నేతలు కబ్జా చేశారు. టిడిపి అధికారంలోకి రాగానే మైనారిటీల ఆస్తులకు రక్షణ కల్పించడంతోపాటు మసీదుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం. గత ప్రభుత్వంలో మైనారిటీల కోసం అమలుచేసిన పథకాలన్నీ పునరుద్దరిస్తాం.
లోకేష్ ను కలిసిన కుందూనది పరీవాహక ప్రాంత ప్రజలు
నంద్యాల సమీపంలోని కుందూనది పరివాహక ప్రాంత ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. కుందూనదిలో పూడిక తీత, విస్తరణ, జలశుద్ధి కార్యక్రమాన్ని తక్షణమే చేపట్టాలి. నదీపరివాహక ప్రాంతం ప్రజలు, రైతులకు ఉపయోగపడేలా నదిని అభివృద్ధి చేయాలి. కుందూనదిపై దొరాశి, రాజోలిబండ ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసి రైతులను ఆదుకోవాలి. నంద్యాల పట్టణం డ్రైనేజీని కుందూనదిలో కలపకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ఎస్పీవై రెడ్డి ఆగ్రోస్, ఇతర పరిశ్రమల కలుషిత వ్యర్థాలను నదిలో కలవకుండా చర్యలు తీసుకోవాలి. నదిపై రాకపోకలకు ఇబ్బందులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి.
నారాలోకేష్ స్పందిస్తూ…
ముఖ్యమంత్రి జగన్ అండ్ కోకు నదుల్లో ఇసుకపై ఉన్న శ్రద్ధ పరీవాహక ప్రాంత ప్రజలపై లేదు. నదులు , ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. ఫలితంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 61మంది అమాయకులు బలయ్యారు. టిడిపి అధికారంలోకి వచ్చినవెంటనే కుందూ నది విస్తరణ, జలశుద్ధి కార్యక్రమాన్ని చేపడతాం. పరిశ్రమల వ్యర్థాలు, మురుగునీరు నదిలో కలవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. కుందూనదిని పరీవాహక ప్రాంత ప్రజలు, రైతులకు మేలుకలిగే విధంగా తీర్చిదిద్దుతాం. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి రైతులకు అండగా నిలబడతాం.
యువనేతను కలిసిన వడ్డెర సామాజికవర్గీయులు
నంద్యాల నియోజకవర్గం జూలపల్లిలో వడ్డెర కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎపి విభాగం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏపీలో దాదాపు 40లక్షల మంది వడ్డెర కులస్తులు ఉన్నారు. గనులు, భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా, ట్యాంకులు, బావులు, ఆనకట్టలు, రైల్వే వంతెనల నిర్మాణం, వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నారు. 1970వరకు వడ్డెరలు ఎస్టీలుగా ఉండేవారు. ఆ తర్వాత బీసీ-ఏ జాబితాలో చేర్చారు. అనంతరామన్ కమిషన్ వడ్డెర విద్యార్థులకు ఉచిత విద్యనందించాలని నివేదిక ఇస్తే దాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వడ్డెర విద్యార్థులకు ఉచిత విద్యనందించాలి. వడ్డెరలకు ప్రమాద బీమా కూడా లేదు. బీమా సౌకర్యం కల్పించాలి. TDP అధికారంలోకి వచ్చాక వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి. 45ఏళ్లు దాటిన వడ్డెరలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. వడ్డెర కార్పొరేషన్ కు నిధులు కేటాయించి ఆదుకోవాలి. వడ్డె ఓబన్న జయంతిని ప్రతియేటా అధికారికంగా నిర్వహించాలి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక వడ్డెర్లతో అన్ని కులవృత్తుల వారు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. వడ్డెర్ల ఉపాధికి ఎన్టీఆర్ హయాంలో క్వారీలు కేటాయిస్తే, జగన్ ప్రభుత్వం వచ్చాక కొందరు వైసిపి నేతలు ఆ క్వారీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో వడ్డెర్లకు ఆదరణ పథకం ద్వారా అధునాతన పనిముట్లు అందజేస్తాం. 2018లో మొట్టమొదటిగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పటుచేసి రూ.147 కోట్ల రూపాయలు కేటాయించాం. వైసిపి ఎటువంటి నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది. టిడిపి అధికారంలోకి వచ్చాక సత్యపాల్ కమిటీ ఆధారంగా వడ్డెర్లకు న్యాయం చేస్తాం. వడ్డెర్లకు చంద్రన్న బీమా పథకాన్ని అమలుచేస్తాం. వడ్డె ఓబన్న జయంతిని ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం.
లోకేష్ ను కలిసిన పసురపాడు గ్రామస్తులు
నంద్యాల నియోజకర్గం పసురపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. పసురపాడు నుంచి మిట్నాల రస్తా బ్రిడ్జి ఏర్పాటుచేయాలి. పసురపాడులో తాగునీటి సమస్య పరిష్కరించాలి. పసురపాడు నుంచి వెళ్లే రస్తాను కొందరు ఆక్రమించారు. ఆక్రమణలు తొలగించి రహదారి ఏర్పాటుచేయాలి. పసురపాడు – జిల్లెల రస్తా బిటి రోడ్డు ఏర్పాటుచేయాలి. పసురపాడు నుంచి ఆంజనేయస్వామి గుడివరకు సిసి రోడ్డు నిర్మించాలి. ఎస్సీ కాలనీలో సిసి రోడ్డు నిర్మించాలి. జిల్లెల నుంచి పసురపాడు కెసి కెనాల్ తూము ఏర్పాటుచేయాలి. శ్రీరామ్ నగర్ లో కెసికెనాల్ రోడ్డు – జిల్లెల రస్తా నిర్మించాలి. శ్రీరామ్ నగర్ రోడ్లు అధ్వాన్నంగా ఉన్నందున, మీరు అధికారంలోకి వచ్చాక రోడ్లు నిర్మించాలి.
*నారా లోకేష్ మాట్లాడుతూ…*
. టిడిపి హయాంలో గ్రామాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చాం. రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేనివిధంగా 25వేల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మించాం. టిడిపి అధికారంలోకి రాగానే పసురపాడు, శ్రీరామ్ నగర్ గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తాం. గ్రామంలో అవసరమైన సిసి రోడ్లు, రస్తాల నిర్మాణం చేపడతాం. వాటర్ గ్రిడ్ ఏర్పాటుద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం.
యువనేత లోకేష్ ను కలిసిన గోస్పాడు ప్రజలు
నంద్యాల నియోజకవర్గం గోస్పాడు గ్రామప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో 2015లో రూ.5.20కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఈ పథకం గత రెండేళ్లుగా నిరుపయోగంగా ఉంది. ఎత్తిపోతల పథకం కింద 600ఎకరాల పొలం సాగుబడిలో ఉంది. కానీ నేడు ఈ భూములు బీడుగా మారాయి. అధికారులకు సమస్యలు వివరించినా పట్టించుకునేవారు లేరు. మీరు అధికారంలోకి వచ్చాక ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తెచ్చి సాగునీరు అందించాలి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
టిడిపి హయాంలో రైతులకోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ఎత్తిపోతల పథకాలను చేపడితే, వాటికి కరెంటు బిల్లులు, నిర్వహణ నిధులు ఇవ్వలేక పాడుబెడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కర్నూలుజిల్లాలో దాదాపు 50వేలఎకరాలకు సాగునీరు అందించి గురురాఘవేంద్ర ప్రాజెక్టు అనుబంధ ఎత్తిపోతల పథకాలకు రూ.132 కోట్ల కరెంటు బిల్లులు బకాయి చెల్లించలేక మూలనబెట్టారు. దేశం మొత్తమ్మీద కరెంటు బిల్లులు కట్టలేక పథకాలను మూసేసిన దిక్కుమాలిన ప్రభుత్వం మరొకటిలేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక నిరుపయోగంగా ఉన్న గోస్పాడు ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తెస్తాం.
యువనేత లోకేష్ ను కలిసిన చింతకుంట్ల గ్రామ రైతులు
నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం చింతకుంట్ల గ్రామ రైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. నంద్యాల మండలం కానాల గ్రామంలోని నాగమ్మ చెరువు నుండి 40ఏళ్లుగా తూము ద్వారా హైస్కూల్ కొట్టాల, చింతకుంట్ల, పసురపాడు గ్రామాలకు సాగు,తాగు నీరు అందుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ తూము అనధికారంగా ఉందని చెప్పి కోర్టు ద్వారా మూసివేయించారు. దీంతో 4గ్రామాలకు తాగు, సాగు నీరు లేక ప్రజలు, రైతులు విలవిల్లాడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కెసి కెనాల్ నుండి నాగమ్మ చెరువుకు ఒక తూము ఏర్పాటు చేయాలి. నాగమ్మ చెరువు నుండి తూమును తెరిపించి మా గ్రామాలకు న్యాయం చేయాలి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
టీడీపీ అధికారంలోకి వచ్చాక కెసికెనాల్ నుంచి నాగమ్మ చెరువుకు నీరు అందిస్తాం. నాగమ్మ చెరువుపై ఆధారపడిన గ్రామాలకు సాగు, తాగునీరు ఇచ్చి ఆదుకుంటాం.
*యువనేత లోకేష్ ను కలిసిన రాయపాడు గ్రామస్తులు
మా గ్రామం పక్కన ఎన్.హెచ్.544డి అనంతపురం టు అమరావతి రోడ్డు ఉంది. వర్షాలు వచ్చినప్పుడు కుందూనది బ్రిడ్జి మీద రాకపోకలు నిలిచిపోతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక కుందూనదిపై బ్రిడ్జి నిర్మించాలి. మా గ్రామంలో వేసవికాలంలో కుందూనది నీరు కలుషితమవుతోంది. ఈ నీరు తాగడం వల్ల చర్మవ్యాధులు సోకుతున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామానికి రక్షితనీరు అందించేలా చర్యలు తీసుకోండి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
నంద్యాల పరిసరాల్లో కుందూనది పక్కనే ఉన్నప్పటికీ ప్రజలు గుక్కెడు నీటి కోసం ఇబ్బంది పడటం విచారకరం. టిడిపి అధికారంలోకి రాగానే కుందూనది శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టి తీరప్రాంత ప్రజల సమస్యను పరిష్కరిస్తాం. రాయపాడుతో సహా కుందూ నది పరిసర గ్రామాల ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందిస్తాం. నేషనల్ హైవే అధికారులతో చర్చించి కుందూనదిపై బ్రిడ్జి నిర్మించి, రాకపోకల సమస్యను పరిష్కరిస్తాం.
Also, read this blog: Yuvagalam Padayatra: Paving the Path of Transformation for Young Leaders
Tagged: #LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh