Latest News:

దళిత జాతికే కళంకం సునీల్‌ కుమార్‌ పులివెందుల వేషాలు కుప్పంలో చెల్లవు అఫిడవిట్‌లో చెప్పినవన్నీ నిజాలే : వైఎస్‌ షర్మిల

నంద్యాలలో యువగళానికి జనప్రభంజనం! యువనేత రాకతో కిటకిటలాడిన పట్టణ వీధులు అడగుడగునా యువనేతకు మహిళల నీరాజనాలు యువత కేరింతల నడుమ ఉత్సాహంగా పాదయాత్ర

యువగళం పాదయాత్రతో నంద్యాల రోడ్లు కిక్కిరిశాయి. Nara Lokesh ని చూసేందుకు జనం భారీగా రోడ్లపైకి వచ్చారు. 102వ రోజైన బుధవారం నంద్యాల పట్టణంలో కొనసాగింది. డప్పుశబ్ధాలు, బాణాసంచా మోతలతో నంద్యాల దద్ధరిల్లింది. యువనేతకు అడుగడుగునా అపూర్వస్వాగతంతో మహిళలు నీరాజనాలు పలికారు. కనీవినీ ఎరుగనిరీతిలో జనం తరలిరావడంతో ఒకానొక సమయంలో పోలీసులు చేతులెత్తేశారు. జై లోకేష్, జై TDP నినాదాలతో నంద్యాల హోరెత్తింది. రోడ్డుకి ఇరు వైపులా ఉన్న భవనాలు ఎక్కి లోకేష్ కి ప్రజలు అభివాదం చేశారు. తనని కలవడానికి వచ్చిన యువత, మహిళలు, వృద్ధులను కలుస్తూ అందరి సమస్యలు తెలుసుకుంటూ లోకేష్ భరోసా కల్పించారు. కాలనీల్లో తిరుగుతూ పేరుకుపోయిన సమస్యల గురించి తెలుసుకున్నారు.  తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు, ఇతర సమస్యల గురించి నంద్యాల వాసులు లోకేష్ ఎదుట చెప్పుకున్నారు. నంద్యాల పట్టణం మూలమఠం నుండి సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. యువనేతకు పాదయాత్ర ప్రారంభం నుండే అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. రోటరీ కంటి ఆసుపత్రి వద్ద మైనారిటీ యువకులు లోకేష్ కు పూలమాలతో స్వాగతం పలికారు. కరెంటు ఆఫీసు రోడ్డు ప్రారంభం నుండి గాంధీ సర్కిల్ వరకు యువనేతకు అడుగడుగునా మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. నయారా పెట్రోల్ బంక్ వద్ద పార్టీ నాయకులు యువనేతకు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. గాంధీ సర్కిల్ వద్ద గాంధీ విగ్రహానికి లోకేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.  భవనాశి జ్యూవెలర్ సెంటర్ వద్ద 50అడుగుల భారీ కటౌట్ తో పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద పార్టీ కార్యకర్తలు ఎల్.ఈ.డీ స్క్రీన్ ఏర్పాటు చేసి యువగళం వీడియోలను ప్రదర్శించారు. సాయిబాబా గుడి సమీపంలో యువనేతను కలిసేందుకు అత్యధిక సంఖ్యలో వచ్చిన మైనారిటీలతో యువనేత సెల్ఫీ దిగారు. రాజ్ థియేటర్ సర్కిల్ వద్ద జరిగిన బహిరంగ సభకు అశేష జనవాహిని తరలి వచ్చారు. వారినుద్దేశించి యువనేత ప్రసంగించారు. బహిరంగ సభ అనంతరం పాదయాత్రను కొనసాగించారు. 102వ రోజు యువనేత 8కి.మీ దూరం నడవగా ఇప్పటి వరకు 1301.8 కి.మీ పాదయాత్ర సాగింది.

వైసీపీ బెదిరిస్తే బెదిరే బచ్చాలెవరూ లేరు!

యువగళం…మనగళం…ప్రజాబలం. ఒక్క అడుగు… ఒక్క అడుగుతో వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  ఒక్క అడుగుతో నా ప్రయాణం మొదలైంది. యువగళం మహా ఉద్యమం గా మారింది. 100 రోజులు పూర్తయిన సందర్భంగా 10 లక్షల మంది యువగళం పాదయాత్రలో భాగస్వామ్యం అయ్యారు. వైసీపీ బెదిరిస్తే భయపడే బచ్చాలు ఎవరూ లేరు. థిస్ ఈజ్ యూత్ పవర్.  అడ్డుకుంటాం అంటూ ఎవడైనా వస్తే దండయాత్రే.  వైసీపీ మాతో పెట్టుకుంటే మటాష్ జాగ్రత్త. నందీశ్వరుడు తప్పస్సు చేసిన నేల నంద్యాల. నవనందులు కొలువైన పుణ్య భూమి నంద్యాల. ఇక్కడికి సమీపంలోనే మహనంది క్షేత్రం ఉంది. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కరువుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు అందరికి అన్నం పెట్టిన దానకర్ణుడు బుడ్డా. వెంగళరెడ్డి. తెలుగువారికి ప్రధాని పదవి దక్కుతుందని నాడు పివి. నరసింహారావు గారు నంద్యాల నుండి పోటీ చేసినప్పుడు అభ్యర్థిని పెట్టకుండా భారీ మెజారిటీతో గెలవడానికి సహకరించింది టిడిపి. శోభానాగి రెడ్డి గారిని నంద్యాల అభివృద్ధిలో చూసుకోవాలి అని కల కన్నారు భూమా నాగిరెడ్డి గారు. భూమా నాగిరెడ్డి గారు 10 వేల ఇళ్లు, రోడ్డు విస్తరణ చేస్తానని చెబితే అందరూ నవ్వారు. చనిపోయే ముందు చంద్రబాబు గారిని కలిసి నంద్యాల అభివృద్ధి గురించి అడిగారు. భూమా నాగిరెడ్డి గారికి ఇచ్చిన మాట ప్రకారం నంద్యాలని అభివృద్ధి చేసారు చంద్రబాబు గారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న నంద్యాల లో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. N Chandrababu Naidu  గారిది రామ రాజ్యం… వైసీపీ ది జంగిల్ రాజ్. చంద్రబాబు గారివి అంబేద్కర్ గారి చట్టాలు.. జగన్ వి బ్రిటిష్ చట్టాలు.బ్రిటిషు చట్టం వాడి నన్ను అడ్డుకోవడానికి ఏ1, జిఓ.1 తీసుకొచ్చాడు. నేను ఆనాడే చెప్పా ఏ1 నువ్వు తెచ్చిన జిఓ.1 మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో అని. జిఓ.1 ని కోర్టు చించి చెత్త బుట్టలో వేసింది. జిఓ.1 పోవడంతో ఏ1 కి పిచ్చెక్కింది. మళ్లీ బ్రిటిషు చట్టాలను పట్టుకొని బయలుదేరాడు.

వైసీపీ వన్నీ కన్నింగ్ ఆలోచనలే!

 వైసీపీ వి అన్ని కన్నింగ్ ఆలోచనలే. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు.  వైసీపీ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి.  వైసీపీ వైసీపీ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్.

కంపెనీలన్నీ తరిమేసి యువతకు అన్యాయం

జగన్ యువత ఎప్పటికీ పేదరికంలో ఉండాలని కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. రాష్ట్రం నుండి కంపెనీలు తరలిపోతున్నాయి. వైసీపీ పాలనలో కంపెనీలు అన్ని బై బై ఏపీ అంటున్నాయి. లక్ష ఉద్యోగాలు కల్పించే ఫ్యాక్స్ కాన్ కంపెనీ తెలంగాణ కి తరలిపోయింది. ఆ కంపెనీ ని ఏపీకి తీసుకురావడానికి నేను ఎంతో కష్టపడ్డాను. అలాంటి కంపెనీలను తరిమేసి యువతకు ఉద్యోగాలు లేకుండా చేసాడు జగన్.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

మహిళల పసుపు,కుంకుమ చెరిపేస్తున్నారు

జగన్  మహిళల పసుపు, కుంకుమ చెరిపేస్తున్నాడు.  సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఎం అయ్యింది? సొంత జే బ్రాండ్లు అమ్ముకొని వేల కోట్లు సంపాదిస్తున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకులధరలు తగ్గిస్తాం.  జగన్  రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు.   జగన్  పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. వైసీపీ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి.  మోటార్లకు మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు.  జగన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు.  వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది.

రాయలసీమకు ఎంచేసాడు!

  జగన్  నేను రాయలసీమ బిడ్డని అంటాడు కానీ ఆయన రాయలసీమ కు ఎం చేయలేదు . అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. రాయలసీమ ఎత్తిపోతల పధకం ఎత్తిపోయింది. ఎన్జిటిలో స్టే ఉంటే కనీసం లాయర్ ని పెట్టే దిక్కులేదు. బాబాయ్ హత్య కేసు నిందితులను కాపాడటానికి పెద్ద లాయర్ల. టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే. రాయలసీమ రైతులకు టిడిపి హయాంలో ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసాడు జగన్ రెడ్డి. ఎస్సి,ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు. రిలయన్స్, అమరరాజా, జాకీ  వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు.

టిడిపి హయాంలోనే నంద్యాల అభివృద్ధి

పాదయాత్రలో భాగంగా జగన్ నంద్యాల వచ్చినప్పుడు అగ్రిగోల్డ్, కేశవ రెడ్డి బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీ గాల్లో కలిసిపోయింది. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తా అన్నాడు, రోడ్లు వేస్తానని హామీ ఇచ్చాడు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు.  టిడిపి హయాంలో నంద్యాల కు స్వర్ణయుగం. రూ.1500 కోట్లతో అభివృద్ధి చేసాం. పేదవాళ్లకు ఇళ్లు, రోడ్ల విస్తరణ, సాగు, తాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది టిడిపి. టిడిపి హయాంలో 10 వేల టిడ్కో ఇళ్లు నిర్మిస్తే వాటిని ప్రజలకు ఇవ్వలేని ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక వసతులు కల్పించి ఇళ్లు కేటాయిస్తాం.  రోడ్లు విస్తరణ, ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నంద్యాల టౌన్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం.  నంద్యాల టౌన్  ప్రజల  తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి వెలుగోడు జలాశయం నుంచి తాగునీటి సరఫరా కోసం పైపులైను పనులు మొదలు పెట్టాం. 80 శాతం పనులు పూర్తి చేసాం. మిగిలిన 20 శాతం పనులు పూర్తిచేయలేక వైసిపి ప్రభుత్వం చేతులెత్తేసింది. టిడిపి గెలిచిన వెంటనే ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం.

అన్నక్యాంటన్లను తిరిగి ప్రారంభిస్తాం!

నంద్యాల జిల్లా ప్రభుత్వం ఆస్పత్రిలో వైద్యులు, మందుల కోరత ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని చికిత్సలు అందేలా ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పిస్తాం. నంద్యాల నుంచి భీమవరం వెళ్లాలంటే మద్దిలేరు వాగు దాటాలి. టీడీపీ ప్రభుత్వంలో వంతెన నిర్మాణం కోసం టెండర్లు కూడా పిలిచాం. కమిషన్ కక్కుర్తితో పనులు ఆపేసారు. నంద్యాలలో మెయిన్ సెంటర్లలో నిత్యం వందల మందికి కడుపు నింపిన అన్న క్యాంటిన్ ను తిరిగి ప్రారంభిస్తాం. విజయ డైరీ లో జరుగుతున్న అక్రమాలు, అవినీతి, కార్మికుల తొలగింపు అన్ని నా దృష్టికి వచ్చాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత దీని పై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. విజయ డైరీ భూములు అమూల్ కి అప్పజెప్పి రైతులకు తీరని అన్యాయం చెయ్యాలని చూస్తున్నారు. రైతులకు అండగా టిడిపి ఉంటుంది. విజయ డైరీ భూములు కాపాడతాం. స్త్రీ నిధి  లోన్స్ ఇవ్వడం ఆపేసారు. గతంలో ఉన్న బకాయిలు టిడిపి ప్రభుత్వం చెల్లించింది. ఆ లోన్స్ ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పే ధైర్యం సండే ఎమ్మెల్యే కి ఉందా? టిడిపి కార్యకర్తల పై అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఎవ్వరినీ వదలం వడ్డీతో సహా చెల్లిస్తాం రాసిపెట్టుకోండి.

యువనేతను కలిసిన ముస్లిం సామాజికవర్గీయులు

నంద్యాల జామియా మసీదు వద్ద ముస్లిం మైనారిటీలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను సంరక్షించి, వాటి ఆదాయాన్ని మైనారిటీ విద్యాసంస్థల అభివృద్ధి, వసతి గృహాలు, స్కాలర్ షిప్ లు వంటి కార్యక్రమాలకు వినియోగించాలి. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు తగిన నిధులు కేటాయించి, ప్రతి నియోజకవర్గంలో ఒక కార్యాలయం ఏర్పాటుచేయాలి. 40శాతం సబ్సిడీపై వృత్తిపనివారలకు, విద్యావంతులకు స్వయం ఉపాధి పథకాలు అందించాలి. ఖబరస్థాన్ ల అభివృద్ధికి నిధులు కేటాయించాలి. నంద్యాల జామియా మసీదు అభివృద్ధికి టిడిపి హయాంలో రూ.54లక్షలు కేటాయించారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు నిధులు మంజూరు చేయలేదు. ఇది నంద్యాల జిల్లాలోనే పెద్ద మసీదు. టిడిపి అధికారంలోకి వచ్చాక మా మసీదుకు రూ.కోటి కేటాయించండి. విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉర్దూ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీచేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

జగన్ ప్రభుత్వంలో మైనారిటీల ధన, మాన, ప్రాణాలకు రక్షణలేదు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. తమ ఆస్తుల కబ్జాను అడ్డుకున్నందుకు నర్సరావుపేటలో వైసిపినేతలు ఇబ్రహీంను దారుణంగా నరికి చంపారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వక్ఫ్  ఆస్తులకు రక్షణ కల్పిస్తాం. గత ప్రభుత్వంలో మైనారిటీ కోసం అమలుచేసిన రంజాన్ తోఫా, దుల్హాన్ వంటి పథకాలన్నింటినీ పునరుద్దరిస్తాం. ఖబర్ స్థాన్ ల అభివృద్ధికి నిధులుకేటాయించి, రక్షణకు ప్రహరిగోడలు నిర్మిస్తాం. నంద్యాల జామియా మసీదు అభివృద్ధికి అదనపు నిధులు కేటాయిస్తాం. గతంలో మాదిరిగా ప్రత్యేక డిఎస్సీ ద్వారా ఉర్దూ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీచేస్తాం.

యువనేత లోకేష్ ను కలిసిన స్వర్ణకారులు…

నంద్యాల కల్పన సెంటర్ లో స్వర్ణకారులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. రెడీమేడ్ నగలు రావడంతో ప్రస్తుతం స్వర్ణకారులం పనుల్లేక ఇబ్బంది పడుతున్నాం. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇతర పనులకు దినసరి కూలీలుగా వెళ్తున్నాం. మాలో చాలామందికి తలదాచుకునేందుకు సొంత ఇళ్లు లేవు. పిల్లలను ఉన్నత చదువులకు పంపడానికి తగిన ఆర్థిక స్థోమత లేదు. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సాయం అందడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మమ్మల్ని ఆదుకోండి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

మారుతున్న కాలానికి అనుగుణంగా స్వర్ణకారులు సాంకేతికంగా అభివద్ధి సాధించాల్సి ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చాక స్వర్ణకారుల నూతన డిజైన్ల కోసం అవసరమైన స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్, అధునాతన పనిముట్లకు రుణాలు అందజేస్తాం. ఇళ్లులేని స్వర్ణకారులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం. స్వర్ణకార పిల్లలకు ఉన్నత చదువులకు సాయం అందిస్తాం.  స్వర్ణకారుల షాపుల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలను అందజేస్తాం.

యువనేతను కలిసిన బొందిలి సామాజికవర్గీయులు

నంద్యాల సాయిబాబా గుడి వద్ద బొందిలి సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన బొందిలి కులాన్ని బిసి-బి జాబితా నుంచి ఒబిసి కేటగిరిలోకి మార్చాలి. బొందిలి కులస్తులకు ఇళ్లస్థలాలు కేటాయించాలి. ప్రస్తుత ప్రభుత్వం బొందిలి కార్పొరేషన్ ఏర్పాటుచేసింది కానీ ఒక్కరికీ కూడా ఆర్థికసాయం అందించలేదు. బొందిలి కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలి. నంద్యాల చుట్టుపక్కల దేవస్థానాలైన శ్రీశైలం, మహానంది వంటి పుణ్యక్షేత్రాల్లో బొందిలి రాజ్ పుట్ ల నిత్యాన్నదాన సత్రాలకు నిధులు కేటాయించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

వైసీపీ కులానికొక కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటుచేసి దారుణంగా మోసగించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక బొందిలి కార్పొరేషన్ కు నిధులు కేటాయిస్తాం. అవకాశాన్ని బట్టి పుణ్యక్షేత్రాల్లో సత్రాల ఏర్పాటుకు స్థలాలు కేటాయిస్తాం. బొందిలి సామాజికవర్గీయుల్లో ఇళ్లులేని వారికి ఇళ్లు మంజూరు చేస్తాం. బొందిలి కులస్తులను ఒబిసి జాబితాలో చేర్చే అంశంపై గత నివేదికలను పరిశీలించి న్యాయం చేస్తాం.

యువనేతను కలిసిన వాల్మీకి సామాజికవర్గీయులు

ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగున ఉన్న వాల్మీకి సామాజికవర్గీయులను ఎస్టీ జాబితాలో చేర్చాలి. ప్రస్తుత ప్రభుత్వం కేవలం రాయలసీమ జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యేలా తీర్మానం చేసి కేంద్రానికి పంపడం దుర్మార్గం. అన్నదమ్ముల్లా ఉన్న వాల్మీకిల మధ్య ప్రాంతీయ వ్యత్యాసాన్ని సృష్టించి అభద్రతాభావానికి గురిచేయడం దారుణం. టిడిపి అధికారంలోకి వచ్చాక కేంద్రంలో బిల్లు ఆమోదింపజేసి మాకు న్యాయం చేయాలి.

లోకేష్ మాట్లాడుతూ…

కులాల మధ్య గొడవలు పెట్టి చలికాచుకోవడం వైసీపీ కి అలవాటుగా మారింది. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాంతాలతో సంబంధం లేకుండా వాల్మీకిలకు న్యాయం చేస్తాం. వాల్మీకి బోయల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం.

యువనేత లోకేష్ ను కలిసిన మున్సిపల్ వర్కర్లు

నంద్యాల టెక్కె మార్కెట్ యార్డు వద్ద సీఐటీయు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. పీఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యాలు వర్తింపజేయాలి. మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. వారికి హెల్త్, రిస్క్ అలవెన్సులు వర్తింపజేయాలి. మున్సిపాలిటీల్లో పనిచేసే కార్మికులకు జీఓ-07 ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు అమలు చేయాలి. ప్రతి కార్మికునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. నంద్యాల మున్సిపాలిటీ లో అన్యాయంగా తొలగించిన 44మంది కార్మికులకు హైకోర్టు తీర్పు ప్రకారం 18నెలల వేతనాలు చెల్లించాలి.

లోకేష్ స్పందిస్తూ…

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ ఒక్క ఉద్యోగి, కార్మికుడు ప్రశాంతంగా బతికే పరిస్థితులు లేవు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిబంధనలకు లోబడి న్యాయం చేస్తాం. పిఎఫ్, ఈఎస్ఐ, బీమా, హెల్డ్ కార్డుల వంటి సౌకర్యాలను వర్తింపజేస్తాం. నంద్యాల మున్సిపాలిటీలో అక్రమంగా తొలగించిన 44మంది కార్మికులకు హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తాం. ఇళ్లస్థలాలు లేని మున్సిపల్ కార్మికులందరికీ ఇళ్లస్థలాలు కేటాయిస్తాం.

లోకేష్ ను కలిసిన నంద్యాల 13వ వార్డు ప్రజలు

నంద్యాల 13వవార్డు ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా వార్డులో 2017లో రోడ్ల విస్తరణ జరిగింది. ఇళ్లు కోల్పోయిన వారిలో కొంత మందికే పరిహారం అందింది. మిగిలిన వారికి పరిహారం ఇప్పించాలి. పద్మావతి నగర్ లో డ్రైనేజీలు, కల్వర్టులు లేవు వాటిని నిర్మించాలి. శ్రీ వెంకటేశ్వర కాలేజీ దగ్గర సిమెంట్ రోడ్డు వేయాలి. భరతమాత గుడి సందు దగ్గర డ్రైనేజీ, కల్వర్టులు నిర్మించాలి. టెక్కె మసీదు దగ్గర కరెంటు స్థంబాలు మార్చాలి. టెక్కె ఆంజనేయస్వామి పక్క సందులో కరెంటు స్థంబాలు అధ్వానంగా ఉన్నాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలి. నాగులకట్ట ఎదురుగా డ్రైనేజీకి రెండు పక్కల కాలువలు ఉన్నాయి. వాటిని కలపాలంటూ వినతి.

లోకేష్ స్పందిస్తూ…

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. మున్సిపాలిటీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధులు లేని దుస్థితి కల్పించాడు. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో కరెంటు బిల్లులు చెల్లించలేక పవర్ కట్ చేయడం జగన్ దివాలా పాలనకు నిదర్శనం. టిడిపి అధికారంలోకి వచ్చిన వచ్చిన వెంటనే రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం అందిస్తాం. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి, సిసి రోడ్లు నిర్మిస్తాం. కొత్త ఎలక్ట్రికల్ పోల్స్, ఎల్ ఇడి లైట్లు ఏర్పాటుచేస్తాం.

యువనేతను కలిసిన దివ్యాంగులు

నంద్యాల ఫైర్ స్టేషన్ వద్ద రాయలసీమ దివ్యాంగుల సేవాసమితి ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నిరుపేద దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ప్రభుత్వమే ఇళ్లు నిర్మించాలి. దివ్యాంగత్వ శాతాన్ని బట్టి పెన్షన్ పెంచాలి. శారీరక దివ్యాంగులకు ఉద్యోగ రిజర్వేషన్ శాతం పెంచాలి. వైసీపీ పాలనలో దివ్యాంగులకు ఎటువంటి సహాయ,సహకారాలు అందడం లేదు. దివ్యాంగుల వివాహాలకు ఎటువంటి ఆర్థికసాయం అందడం లేదు. త్రీవీలర్ మోటార్ సైకిల్స్ రావడం లేదు. 45ఏళ్లు లోపు వారికే అని నిబంధనలు పెట్టారు. వైసీపీ పాలనలో దివ్యాంగులకు పెన్షన్ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దివ్యాంగుల కార్పొరేషన్ కు డైరెక్టర్లను నియమించలేదు. వైసీపీ పాలనలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీని నిలిపేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించండి.

లోకేష్ స్పందిస్తూ…

దివ్యాంగులపై సానుభూతి చూపాల్సిన ముఖ్యమంత్రి కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల సంక్షేమానికి రూ.6,500 కోట్లు ఖర్చుచేశాం. టీడీపీ హయాంలో దివ్యాంగులకు పార్లమెంట్ నిధుల నుండి బ్యాటరీ సైకిళ్లను ప్రతి పార్లమెంటు పరిధిలో పంపిణీ చేశాం. వయస్సుతో సంబంధం లేకుండా త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందించాం. టిడిపి అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు కార్పొరేషన్ కు నిధులిచ్చి బలోపేతం చేస్తాం. అవసరమైన వారందరికీ కృత్రిమ అవయవాలు పంపిణీచేస్తాం. ఇళ్లు లేని వారికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తాం.

లోకేష్ ను కలిసిన చాబోలు భూనిర్వాసితులు

నంద్యాల రూరల్ చాబోలు భూ నిర్వాసితులు యువనేత లోకేష్ ను తమ సమస్యలను విన్నవించారు. మా గ్రామ ప్రజలమంతా వ్యవసాయంపై  జీవనం కొనసాగిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం ఇటీవల మా గ్రామంలోని వెయ్యి ఎకరాల భూమిని మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఇండస్ట్రియల్ జోన్ గా మార్చింది. ఆ భూములన్నీ మాల, మాదిగ, బోయ, దూదేకులకు చెందిన సన్న, చిన్నకారు రైతులవి. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల భూములను మాత్రం కమర్షియల్ జోన్ లోకి మార్చుకున్నారు. మా సమస్యలపై ఎమ్మెల్యే, ఎంపీలకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మా భూములను ఇండస్ట్రియల్ జోన్ నుండి తొలగించాలి. నేషనల్ హైవే-44 ను దాటేప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక హైవేకి ఇరువైపులా సర్వీసురోడ్లు నిర్మించాలి. మా గ్రామంలో డ్రైనేజీ సమస్య అత్యధికంగా ఉంది. పక్క గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.  మీరు అధికారంలోకి వచ్చాక రోడ్లు, డ్రైన్లు నిర్మించండి.

నారా లోకేష్ స్పందిస్తూ…

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎప్పుడు ఎవరి భూములు కొట్టేస్తారో జనం బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఎపి చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీల భూముల విస్తీర్ణం తగ్గిందని కేంద్ర నివేదికలు చెబుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దోచుకోవడం పై పెట్టిన శ్రద్ధ, ఓట్లేసి గెలిపించిన ప్రజల సంక్షేమం పై పెట్టడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక చాబోలు భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం. చాబోలు గ్రామంలో రోడ్లు, డ్రైనేజిలు, ఇతర మౌలిక సదుపయాలు కల్పిస్తాం. ఎన్.హెచ్-44 కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించి ప్రమాదాలను అరికడతాం.

యువనేత లోకేష్ ను కలిసిన ఆటోడ్రైవర్లు

నంద్యాల సాయిబాబా నగర్ ఆర్చి వద్ద సిఐటియు అనుబంధ ఆటో డ్రైవర్ల సంఘం నాయుకలు యువనేత లోకేష్ ను కలసి వినతిపత్రం సమర్పించారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి రూ.1,000కోట్లు నిధులు కేటాయించి, ఖర్చు చేయాలి. ప్రైవేటు ఫైనాన్స్ ల అధిక వడ్డీ ఆగడాలను అరికట్టాలి. ఈ చలానాల పేరుతో ఆర్టీఓ, పోలీసు అధికారుల వేధింపులను ఆపాలి. భారీ చలానాలు, జరిమానాలు తగ్గించాలి. పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ ట్యాక్సు తగ్గించాలి. అర్హులైన ఆటో డ్రైవర్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ప్రభుత్వమే ఇళ్లు నిర్మించాలి. జీఓ-21ను పూర్తిగా రద్దు చేయాలి. పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలి, 55ఏళ్లు దాటిన ప్రతి ఆటో డ్రైవర్ కు రూ.6వేలు పెన్షన్ ఇవ్వాలి. ఆటోస్టాండ్లకు ప్రభుత్వమే స్థలాలు ఏర్పాటు చేయాలి. డ్రైవర్ కి సున్నా వడ్డీకే ఆటో కొనుగోలుకు బ్యాంకు లోన్ ఇచ్చే ఏర్పాటు చేయాలి.

లోకేష్ స్పందిస్తూ…

వైసీపీ ఆటోడ్రైవర్లను సైత వదలకుండా రక్తం పీలుస్తున్నారు. కేవలం కొంతమందికి రూ.10వేలు ఇస్తూ… ఫైన్ల రూపంలో ఐదారురెట్లు లాగేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఆటోకార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. పెట్రోలు, డీజిల్ ధరలను అదుపుచేసి, ఆటోల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు అందజేస్తాం. ఆటోస్టాండ్లకు స్థలాలు కేటాయించి, ఎలక్ట్రిక్ ఆటోలకు రీచార్జి స్టేషన్లు ఏర్పాటుచేస్తాం. ఇళ్లులేని ఆటోకార్మికులందరికీ ఇళ్ళస్థలాలు మంజూరు చేస్తాం.

యువనేతను కలిసిన నంద్యాల న్యాయవాదులు

నంద్యాల టుటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద న్యాయవాదులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అమరావతిని ప్రధాన రాజధానిగా ప్రకటించినందున కర్నూలుకు ప్రత్యామ్నాయంగా న్యాయం చేయాలి. న్యాయవాదుల వృత్తినైపుణ్యతకు శిక్షణా వ్యవస్థను ఏర్పాటుచేయాలి. న్యాయవాదులపై భౌతిక దాడులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణచట్టం తేవాలి. న్యాయవాదుల ఆరోగ్యభద్రతకు హెల్త్ కార్డులతోపాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. న్యాయవాదుల సంక్షేమనిధి నిబంధనలను సడలించాలి. న్యాయవాదులకు ఇళ్లస్థలాలు కేటాయించాలి. జూనియర్ న్యాయవాదులకు గ్రంథాలయాలు ఏర్పాటుచేయాలి.

యువనేత లోకేష్ మాట్లాడుతూ…

వైసీపీ  మాదిరి నమ్మించి మోసగించడం తెలుగుదేశం పార్టీ విధానం కాదు. కర్నూలులో హైకోర్టు అని చెప్పిన జగన్… సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని అఫిడవిట్ ఇచ్చారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేస్తానని నాలుగేళ్లలో ఒక్క ఇటుక అయినా జగన్ పెట్టారా? ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్ట పబ్బంగడుపుకోవడం జగన్ కు వెన్నతోపెట్టిన విద్య. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుచేస్తాం.జూనియర్ న్యాయవాదులకు శిక్షణా కేంద్రాలు, గ్రంథాలయాలు, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ అమలుచేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులకు ఇళ్లస్థలాలు మంజూరు చేస్తాం. న్యాయస్థానాలు, న్యాయవాదులపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం, దాడులకు పాల్పడే సంఘ వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపుతాం.

యువనేత లోకేష్ ను కలిసిన నంద్యాల ఎన్ జిఓ కాలనీవాసులు

నంద్యాల ఎన్ జిఓ కాలనీ వాసులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలి. ట్రాఫిక్ సమస్యలు పెరిగి రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. పరిష్కార చర్యలు తీసుకోవాలి. మా కాలనీలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. సమస్యను పరిష్కరించాలి. కాలనీలో వీధిదీపాలు, పారిశుధ్య నిర్వహణ సరిగా లేదు. తగు చర్యలు తీసుకోవాలి. మీరు అధికారంలోకి వచ్చాక మా కాలనీ సమస్యలు పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ...

వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త రోడ్ల మాట దేవుడెరుగు, ఉన్న రోడ్ల పాడైతే తట్ట మట్టిపోసే దిక్కులేదు. కనీసం బ్లీచింగ్ పౌడర్, వీధిదీపాలకు కూడా డబ్బుల్లేని దుస్థితికి మున్సిపాలిటీలను చేర్చారు. టిడిపి అధికారంలోకి రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజి, ఎల్ ఈడి వీధి దీపాలు, సిమెంటు రోడ్లు నిర్మిస్తాం. వాటర్ గ్రిడ్ ఏర్పాటుద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. రోడ్లను విస్తరించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తాం.

యువనేతను కలిసిన భవననిర్మాణ కార్మికులు

నంద్యాల నూనెపల్లి ఫ్రైఓవర్ వద్ద భవన నిర్మాణ కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మాకు పనులు లేకుండా పోయాయి. ఇసుక దొరక్కపోవడంతో నిర్మాణరంగం కార్మికులంతా ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సమయంలో బ్రతకడానికి అప్పుల పాలయ్యాం, నేడు అప్పులు తీర్చడానికి ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం నుండి నేటికీ మాకు ఎలాంటి సహాయ, సహకారాలు అందలేదు. కరోనాలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నేటికీ ప్రబుత్వం ఎటువంటి సహాయం అందలేదు. నంద్యాల పట్టణంలో 75వేల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా కార్మికులందరినీ ఆదుకోవాలి.

లోకేష్ స్పందిస్తూ…

వైసీపీ ధనదాహం కారణంగా రాష్ట్రంలోని 40లక్షలమంది భవననిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారు. కరోనా సమయంలో ప్రభుత్వం కనీస సాయం అందకపోవడంతో 70మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఇసుక ద్వారా రూ.10వేల కోట్లు దోచుకున్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం టిడిపి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంక్షేమ బోర్డు నుంచి రూ.2వేలకోట్లు దారిమళ్లించారు. టిడిపి మళ్లీ అధికారంలోకి రాగానే భవన కార్మికుల సంక్షేమ బోర్డును బలోపేతంచేసి, కార్మికులకు సాయం అందిస్తాం. ఇసుక పాలసీని సరళతరం చేసి అన్ని ప్రాంతాల్లో ఇసుకను అందుబాటులోకి తెస్తాం. భవన నిర్మాణరంగానికి గతవైభవం చేకూర్చి, కార్మికులకు చేతినిండా పనికల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన నంద్యాల పట్టణ ప్రజలు

నంద్యాల పట్టణ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. నూనెపల్లి గాంధీనగర్, బొగ్గులైన్, నూనెపల్లె ఫ్లై ఓవర్ సర్కిల్, అయిలూరు మెట్ట సర్కిల్ ప్రాంతాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. నూనెపల్లి బొగ్గులైనులో మంచినీటి కుళాయి ఒక్కటే ఉంది. వేసవిలో నీటి సమస్య అత్యధికంగా ఉంది. రైల్వే స్టేషన్, బొగ్గులైన్ రోడ్డుకు ఇరువైపులా దశాబ్ధులగా పేదలు షెడ్లు వేసుకుని నివసిస్తున్నారు. వీరిని వైసీపీ ప్రభుత్వం బలవంతంగా ఖాళీ చేయిస్తోంది. వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి. లేదంటే మాకు స్థలాలు కేటాయించి మమ్మల్ని ఇక్కడి నుండి ఖాళీ చేయించాలి. గాంధీనగర్ లో మురుగునీటి సమస్య అత్యధికంగా ఉంది. పరిష్కరించాలి. నూనెపల్లి ఫ్లై ఓవర్ సర్కిల్ వద్ద ప్రభుత్వ ఆసుపత్రి , రైల్వేస్టేషన్ వద్ద అక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలి. అయ్యలూరి మెట్ట సర్కిల్ వద్ద నీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్యాంకు సామర్థ్యం సరిపోవడం లేదు. సమస్యను పరిష్కరించాలి.

లోకేష్ స్పందిస్తూ…

లక్షలాదిమంది పేదల ఆకలితీర్చిన అన్నా క్యాంటన్లను రద్దుచేసి పేదల పొట్టగొట్టిన జగన్మోహన్ రెడ్డి. టిడిపి అధికారంలోకి రాగానే అన్నక్యాంటన్లను పునరుద్దరించి పేదల ఆకలి తీరుస్తాం. వాటర్ గ్రిడ్ ఏర్పాటుద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. నంద్యాల పట్టణ ప్రజల అవసరం మేరకు అదనపు వాటర్ ట్యాంకులను ఏర్పాటుచేస్తాం. రైల్వేస్టేన్, బొగ్గులైన్ ప్రాంతాల్లో ఖాళీచేయించిన పేదలకు ప్రత్యామ్నయ స్థలాలు కేటాయిస్తాం.

Also, read this blog: Yuvagalam Padayatra: Igniting the Spirit of Youth for a Brighter Future

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *