*జగన్ ప్రభుత్వ చేతగానితనం వల్లే మైనారిటీలపై దాడులు*
*మైనారిటీలపై దాడులు చేస్తుంటే డిప్యుటీ సిఎం ఏంచేస్తున్నారు?*
*420 కావాలో, అభివృద్ధి ప్రదాత కావాలో తేల్చుకోండి!*
*ప్రభుత్వం మేల్కొని మైనారిటీ సోదరులకు రక్షణ కల్పించాలి*
*కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీని ప్రారంభిస్తాం!*
*హైదరాబాద్ ను తలదన్నేలా కడప, విజయవాడ హజ్ హౌస్ లు*
*దూదేకులకు దామాషా ప్రకారం చట్టసభల్లో అవకాశం కల్పిస్తాం*
*లోకేష్ తో గుఫ్తగు కార్యక్రమంలో యువనేత స్పష్టీకరణ*
*రాక్షసులతో పోరాడానికి మీ అండ కావాలని ముస్లింల అభ్యర్థన*
కర్నూలు: కర్నూలు: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థత, చేతగానితనం వల్లే మైనారిటీలపై గతంలో ఎన్నడూ లేనివిధంగా దాడులు కొనసాగుతున్నాయని టిడిపి యువనేత Nara Lokesh దుయ్యబట్టారు. కర్నూలులో లోకేష్ తో గుఫ్తగు కార్యక్రమంలో భాగంగా యువనేత లోకేష్ ముస్లిం మైనారిటీ సోదరులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి సంధానకర్తలుగా కడపకు చెందిన డాక్టర్ నూరి ఫర్వీన్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లీ వ్యవహరించారు. సమావేశంలో మైనారిటీ అడిగిన ప్రశ్నలకు యువనేత లోకేష్ ముక్కుసూటిగా సమాధానమిచ్చారు. నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలామ్ అబ్దుల్ సలాం అత్త షేక్ మామునీ, ఆళ్లగడ్డలో వైసిపినేతల వల్ల వేధింపులకు గురైన అక్బర్ తమ కుటుం టీడీపీబాలకు జరిగిన అన్యాయాన్ని సభలో చెప్పినపుడు యువనేత లోకేష్ తోపాటు ముస్లిం సోదరులు ఉద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా యువనేత లోకేష్ మాట్లాడుతూ… టిడిపి అధికారంలోకి వచ్చిన 24గంటల్లో వైసిపినేతలు ఆక్రమించిన భూమిలోకి అక్బర్ వెళ్లేలా చేస్తామని చెప్పారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన 3నెలల్లో పలమనేరు మిస్బా, నంద్యాలలో అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్యలకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ముస్లిం మైనారిటీలపై వరుస దాడులు, హత్యలు, వేధింపులు జరుగుతుంటే మైనారిటీ ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని యువనేత నిలదీశారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల ఆస్తుల పరిరక్షణకు వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తామని, ముస్లింలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఇస్లామిక్ బ్యాంక్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తామని, పేద ముస్లిం విద్యార్థుల కోసం ఫీజు రీఎంబర్స్ మెంట్ , విదేశీవిద్య పథకాలను పునః ప్రారంభిస్తామని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలో 420 కావాలో, అభివృద్ధి ప్రదాత చంద్రన్న కావాలో మైనారిటీ సోదరులు తేల్చుకోవాలని అన్నారు.
మత సామర్యానికి మారుపేరు ఏపీ అని, మన మధ్యలో గొడవలు ఏనాడూ లేవని లోకేష్ అన్నారు. భావితరాలు కూడా ఇలాగే ఉండాలంటే ప్రభుత్వాలు పెద్దన్న పాత్ర పోషించాలని, గత నాలుగేళ్లుగా ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ముస్లింల హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని కూడా ప్రభుత్వాలు తగ్గించాయని, మీకేం కావాలో నేరుగా చర్చించేందుకే గుఫ్తగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లోకేష్ తో గుఫ్తగు కార్యక్రమంలో ముస్లిం సోదరుల ప్రశ్నలు, యువనేత లోకేష్ సమాధానాలు ఇలా ఉన్నాయి.
*లోకేష్ తో గుఫ్తగు కార్యక్రమంలో ప్రశ్నలు – లోకేష్ సమాధానాలు:*
సంధానకర్త ప్రశ్న : రంజాన్ మాసంలో మా స్నేహితులు మా ఇంటికి విందుకు వచ్చేవారు.. మీ స్నేహితుల ఇళ్లకు వెళ్లి రంజాన్ మాసంలో బిర్యాని తిన్నారా.?
లోకేష్ : నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. రంజాన్ మాసం వచ్చినప్పుడు మేమ పాతబస్తీకి వెళ్లి హలీం, బిర్యానీ తింటాం. నేను ప్రస్తుతం పాదయాత్రలో ఉన్నందున బ్రాహ్మణి పాతబస్తీకి దేవాన్షన్ తీసుకెళ్లి హలీం తినిపించారు. రంజాన్ మాసాన్ని ఆనందంగా జరుపుకుంటాం.
ప్రశ్న : విద్యా దీవెన్ కొందరికి, పేరుకు మాత్రమే ఉంది. మదరసాలకు ఈ ప్రభుత్వం నుండి సాయం అందడం లేదు. దీనిపై మీరొచ్చాక ఏం చర్యలు తీసుకుంటారు.?
లోకేష్ : పేదలు బాగా చదవాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రవేశపెట్టాయి. ప్రభుత్వాలు మారినా సంక్షేమాన్ని కుదించలేదు. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో నామ మాత్రంగా అందిస్తున్నారు. ఫీజుల విధానంలో పాత విధానాన్ని తీసుకొస్తాం. బాగా చదివే విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి లేకుండా చేస్తాం. మదరసాలకు సాయంపై పార్టీ పెద్దలతో చర్చించి ప్రకటిస్తాం.
ప్రశ్న : వక్ఫ్ బోర్డుకు 64 వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయి. 87 శాతం కబ్జా అయ్యాయి. ఈ సమస్యను మీరు ఏవిధంగా పరిష్కరించగలరు.
లోకేష్ : పూర్వికులు మైనారిటీల సంక్షేమం కోసం భూములు ఇచ్చారు. వాటి రక్షణకు ఎన్టీఆర్ వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా జీవో తెచ్చి కలెక్టర్, ఎస్పీ, సీనియర్ అధికారులను నియమించి కబ్జాలపై చర్యలు తీసుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం పార్టీ కార్యకర్తలను వక్ఫ్ బోర్డులో నియమించుకున్నారు. వక్ఫ్ భూముల కబ్జాలపై ఆధారాలతో మాట్లాడాలని వైసీపీ నేతలు అంటున్నారు. కర్నూలులో 209/1 సర్వే పరిధిలో 1.5 ఎకరాలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కబ్జా చేశారు. ఈ భూమి నుండి ఖాళీ చేయాలని కోర్డు కూడా చెప్పింది. దిన్నెదేవరపాడులో సర్వే నంబర్ 19లో రూ.600 కోట్లు విలువ చేసే కొట్టాల మసీదుకు చెందిన 59.19 ఎకరాలు భూమిలో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు వెంచర్లు వేశారు. రాష్ట్రంలో ఎక్కడ వక్ఫ్ భూములు ఉన్నా కబ్జా చేశారు. TDP అధికారంలోకి వచ్చాక వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ అధికారాలు ఇస్తాం. టీడీపీ హయాంలో వక్ఫ్ భూముల వైపు చూడాలంటే భయపడేవారు. మళ్లీ ఆ విధానం తీసుకొస్తాం.
సమీర్ : మైనారిటీల సంక్షేమానికి అధికారంలోకి వచ్చాక మీరు ఏం చేస్తారు.?
లోకేష్ :. రూ.10 అకౌంట్లో వేసి రూ.100 లాగుతున్నారు. దుల్హన్, రంజాన్ తోఫా, హజ్ యాత్రలకు ఇచ్చే సబ్సీడీ కట్ చేశారు. అన్న క్యాంటీన్ తో పాటు 100 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మైనారిటీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించి ఖర్చు చేస్తాం. ఎన్టీఆర్ సీఎం అయ్యాక దేశంలోనే మొదటి సారి మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. జగన్ పనైపోయింది..వచ్చేది టీడీపీ ప్రభుత్వమే.
ప్రశ్న : హిజాబ్ పై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి.?
లోకేష్ : హిజాబ్ పై టీడీపీ క్లారీటీగా ఉంది… అందరి మత విశ్వాసాలను టిడిపి గౌరవిస్తుంది. హిజాబ్ అనే ముస్లింల సెంటిమెంట్ కు సంబంధించిన అంశం. వారి మనోభావాలను మేం గౌరవిస్తాం.
సలీం: ఉర్దూ పాఠశాలల్లో టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం మెగా డీఎస్సీతో భర్తీ చేస్తామన్నా కానీ చేయలేదు..మీరు వచ్చాక భర్తీ చేస్తారా.?
లోకేష్ : 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక 1,200 ఉర్దూ పోస్టులను భర్తీ చేశాం. అందరికీ ముద్దలు పెట్టాడు.. న్యాయం చేస్తాడని జగన్ ను మీరు తెచ్చుకున్నారు. విలీనం పేరుతో స్కూళ్లను మూసేస్తున్నాడు. టీచర్ పోస్టులు ఖాళీ లేవని చెప్తున్నారు. విద్యను పేదలకు దగ్గర చేసి, ప్రత్యేక డీఎస్సీ ద్వారా టీచ్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం.
కరిముల్లా : గతంలో షాదీఖానాలు నిర్మించారు..కానీ ఈ ప్రభుత్వం విస్మరించింది. మీరు వచ్చాక మళ్లీ షాధీఖానాలు నిర్మిస్తారా.?
లోకేష్ : 1983లోనే షాధీ ఖానాల నిర్మాణానానికి ఎన్టీఆర్ చర్యలు తీసుకున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అనేక షాదీ ఖానాలు నిర్మించతలపెట్టాం..కానీ ఈ ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేదు. మైనారిటీలు ఎక్కువగా ఉన్నచోట మొదట షాధీ ఖానాలు కడతాం..తర్వాత మండల స్థాయిలో ఏర్పాటు చేస్తాం.
ప్రశ్న : వైసీపీ వచ్చాక అబ్దుల్ సలాం కుటుంబంపై దొంగతనం నెపం వేయడంతో ఆత్మహత్య చేసుకుంది. కానీ ప్రభుత్వం స్పందించలేదు. మత పెద్దలు ప్రశ్నించాకే ప్రభుత్వంలో చలనం వచ్చింది. బాగా చదివే మిస్బాను వేధించడంతో ఆత్మహత్య చేసుకుంది. 78 కుటుంబాలపై ఈ ప్రభుత్వం వేధింపులకు పాల్పడింది. (మిస్బా, అబ్దుల్ సలాం వీడియోల ప్రదర్శన)
లోకేష్ : మిస్బా ఘటన చాలా బాధాకరం. ఆమె డైరీ నేను చూశాను. బాగా చదవి, డాక్టర్ అవ్వాలని కల కనింది. అన్నింటిలో మొదట వచ్చినందుకు వైసీపీ నేతలు మిస్బాను, ఆమె కుటుంబాన్ని వేధించడంతో మిస్బా ఆత్మహత్య చేసుకుంది. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. నేను ఆత్మహత్య చేసుకుంటే నా తల్లిదండ్రులు వేధింపులకు గురి కారు మిస్బా అని చనిపోయింది. ప్రభుత్వం ఇప్పటికీ దానిపై స్పందిచడంలేదు. మిస్బా కామా పెట్టిన దగ్గర నేను ప్రారంభించి డాక్టర్ అయ్యి సమాధానం చెప్తానని ఆమె తమ్ముడు అన్నాడు. మైనారిటీలు డాక్టర్లు అవ్వకూడదా.? ముస్లిం పిల్లలు పైకి రాకూడదా.? ఈ ఆత్మహత్య వెనుక ఎవరున్నారో ప్రభుత్వం కఠినంగా శిక్షించి ఉంటే మిగతా వారు భయపడేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే మిస్బా ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మిస్బా కుటుంబానికి న్యాయం చేయాలి. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నాకే వీడియో బయటకు వచ్చింది. కారకులను శిక్షించకుండా ఓ కాంట్రాక్టు పోస్టు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నప్పుడే చర్యలు తీసుకుని ఉంటే మిస్బా, ఇబ్రహీం మన మధ్య ఉండేవారు. మనకు తెలియని దాడులు చాలా ఉన్నాయి. అడుగడుగునా మైనారిటీల పట్ల ఈ ప్రభుత్వం చిన్నచూపుతో వ్యవహరిస్తోంది.
షేక్.మామూనీ, అబ్దుల్ సలాం అత్త : చేయని నేరానికి నా అల్లుడిపై నేరం మోపారు. నా అల్లుడికి నరకం చూపించారు. చనిపోయాక అందరూ వచ్చారు. నా కుటుంబానికి జరిగినట్లు ఎవరికీ జరక్కూడదు. నలుగురుని పోగొట్టుకున్నాను. ఇప్పటి వరకు మాకు న్యాయం చేయలేదు. అబ్దుల్ సలాం దొంగకాదని ఇప్పటికీ నిరూపించలేదు. నా అల్లుడి కుటుంబానికి సిఐ సోమశేఖర్ రెడ్డి నరకం చూపించారు. ప్రతిరోజూ పోలీసులను ఇంటికి పంపించి టార్చర్ చేశారు
లోకేష్ : అబ్దుల్ సలాం కుటుంబం, మిస్బా ఆత్మహత్యలకు ప్రేరేపించిన వారిని టిడిపి అధికారంలోకి వచ్చాక 3నెలల్లో శిక్షిస్తాం, ధైర్యంగా ఉండండి.
అక్బర్ బాషా, ఆళ్లగడ్డ : రాక్షసులతో మేము పోరాడుతున్నాం. మీరు మా వెనక ఉంటే ఇంకా పోరాడుతాం. చావాలన్నా ధైర్యం ఉండాలి. నేను, నా బిడ్డలు, భార్య మందు తాగాం. నా భూమికి రూ.10 లక్షలు ఇస్తామని అన్నారు. ఫోన్లో సజ్జల వింటున్నారు..నీ పేపర్లు ఇవిగో అని చెప్పి నాతో తప్పుడు స్టేట్ మెంట్ ఇప్పించారు. హైకోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినా నన్ను భూమిలోకి దిగనివ్వలేదు. మా కోసం షుబ్లీ పోరాడితే ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టి జైల్లో పెట్టారు. నా ఇళ్లు కూల్చేస్తాం అని బెదిరించారు. భూమి మీదే భూమి అని సజ్జల రామకృష్ణారెడ్డి మొదట నాతో చెప్పాడు..కానీ ఇప్పడు సీఎం బంధువుదే భూమి అంటున్నారు.
లోకేష్ : అక్బర్ బాషా వైసీపీకి చెందిన వ్యక్తి. కానీ వైసీపీ నేత తిరుపాల్ రెడ్డి వారి భూమిని కబ్జా చేశారు. ఆత్మహత్యాయత్నం కూడా చేశారు..పోరాడబట్టే మన మధ్య ఉన్నారు. కోర్టు నుండి ఆదేశాలు వచ్చినా తిరుపాల్ రెడ్డి భూమి ఇవ్వలేదు. వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. అక్బర్ ను చంపేస్తామని చెప్తున్నారు. అక్బర్ ధైర్యంగా ఉండు..మీకు అండగా నేను ఉంటా. టీడీపీ వచ్చాక 24 గంటల్లో ఆ భూమిలో మీరు అడుగుపెట్టేలా చేస్తా. జగన్ కాదు..ఎవరొచ్చినా ఏమీ చేయలేరు.
జానీబాషా, పల్నాడు, పిన్నెల్లి : 30 ఏళ్లుగా మేము టీడీపీలో ఉన్నాం. వైసీపీ వచ్చాక 100 ముస్లిం కుటుంబాలను ఊర్లో నుండి తరిమేశారు. 40 మందికి కాళ్లు, చేతులు విరగొట్టారు. స్టేషన్ కు వెళ్తే పోలీసులు కూడా కేసులు తీసుకోలేదు. నమాద్ చేసుకోవడానికి కూడా వెళ్లనీయకుండా బెదిరించారు. మా 100 కుటుంబాలను ఊర్లోకి వెళ్లేలా సాయం చేయండి. మాచవరం ఎస్ఐని కలిస్తే లోకేష్, చంద్రబాబుకు చెప్పుకోపో అన్నాడు.
లోకేష్ : బాగా చదివే పిల్లలపై కేసులు పెడుతున్నారు. కౌన్సిల్ లో షరీఫ్ ను అవమానించారు. పల్నాడులో జరిగే అరాచకాలపై సీబీఐ విచారణ వేస్తామని నాటి హోం మంత్రి చెప్పారు. మీరు ధైర్యంగా ఉండండి..ఇబ్బంది పెట్టిన అధికారులను సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తాం. చట్టాలను ఉల్లంఘించినందుకు శిక్షిస్తాం. మీ గ్రామంలో మీరు ఉండేలా చేస్తాం.
ప్రశ్న : దుల్హన్ పథకానికి షరతులు పెట్టారు. మీరు వచ్చాక దుల్హన్ ను ఏవిధంగా అమలు చేస్తారు.?
లోకేష్ : టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెళ్లి జరుగుతుందని కార్డు పంపగానే దుల్హన్ కింద రూ.50 వేలు అందించాము. రాష్ట్రంలో సుమారు 48 వేల కుటుంబాలకు దుల్హన్ ద్వారా ఆదుకున్నాం. మాటలు చెప్పే జగన్. జగన్ కేవలం మేము ఇచ్చిన దాంట్లో 10 శాతం మందికే దుల్హన్ ఇచ్చారు. షరతులు లేకుండా మళ్లీ దుల్హన్ పథకాన్ని అమలు చేస్తాం.
ప్రశ్న : వచ్చే ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందా.?
లోకేష్ : 2014లో బీజేపీ, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ ఏనాడైనా ఒక్క మైనారిటీ సోదరుడిపైన అయినా దాడి జరిగిందా..వేధింపులతో ఆత్మహత్యలు చేసుకున్నారా.? దుల్హన్, తోఫా, మసీదులకు రంగులు వేసుకునేందుకు డబ్బులు కూడా బీజేపీతో కలిసి ఉన్నప్పుడే ఇచ్చాం. ఇమాం, మౌజామ్ లకు జీతాలు ఇచ్చాం. రాజకీయ పొత్తులకు సంబంధం లేకుండా మైనారిటీలకు గతంలో ఏవిధంగా సంక్షేమాన్ని అందించామో అదేవిధంగా అందిస్తాం.
ప్రశ్న : టీడీపీలో ముస్లిం మహిళలకు స్థానం ఏంటి.?
లోకేష్ : టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏలూరు మేయర్, గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ గా మైనారిటీ మహిళలకే పదవులు ఇచ్చాం. ముస్లిం మహిళలు కూడా ముందుకు రావాలి..మార్పు కోసం కలసి అంతా కలసి పని చేయాలి.
ప్రశ్న : టీడీపీ హయాంలో కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ కోసం భూమి కేటాయించి..నిధులు కేటాయించింది. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మీరు వచ్చాక పూర్తి చేస్తారా.?
లోకేష్ : టీడీపీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలోనే ఉర్దూ యూనివర్సిటీ పూర్తి చేసి అడ్మిషన్లు ప్రారంభిస్తాం. 100 ఎకరాలు కేటాయించి పనులు యూనివర్సీటీ పనులు ప్రారంభించాం. మైనారిటీలు బాగా చదువుకోకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సీఎం పనులు నిలిపేశారు. విదేశీ విద్య, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిలిపేశారు. మళ్లీ మేము వాటిని ప్రవేశపెడతాం.
ప్రశ్న : మీకు బిర్యానీ అంటే ఇష్టమా..మీరు ఎప్పుడైనా వండారా.?
లోకేష్ : నేను కొంత లావు అయింది కూడా బిర్యానీతోనే. హలీం అంటే నాకు ఇష్టం. వాటిని నేను ఎందుకు దూరం పెడతాను.?
షేక్.ఖాదర్ బాషా : గతంలో గుంటూరులో నారా హమారా – టీడీపీ హమారా కార్యక్రమంలో ప్లకార్డులు పట్టుకున్న వారిపై మీ ప్రభుత్వంలో కేసులు పెట్టారు. కానీ ఇప్పటికీ ఈ ప్రభుత్వం ముస్లింలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు..మీరు ఇస్తారా.?
లోకేష్ : గుంటూరులో నారా హమారా – టీడీపీ హమారా సభలోకి కావాలని వైసీపీ నేతలు కొందరిని పంపించారు. మైనారిటీలను లోక్ సభకు పంపింది టీడీపీనే. ముగ్గరుని రాజ్యసభకు పంపిందికూడా మేమే. ఫరూక్ ను మంత్రిని చేశాం..షరీఫ్ ని మండలి చైర్మన్ చేశాం. పదవులే కాదు..గౌరవం కూడా ఇస్తాం. మీ సమస్యలపై ఉపముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు.? మైనారిటీలను అంజాద్ బాషా మర్చిపోయారు. టీడీపీ వచ్చాక దామాషా ప్రకారం రాజకీయాల్లో అవకాశం కల్పిస్తాం.
ప్రశ్న : మైనారిటీ కార్పొరేషన్ ను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇస్లామిక్ బ్యాంక్ గురించి మీరు ఏం చెప్తారు.?
లోకేష్ : దామాషా ప్రకారం ముస్లింలకు నిధులు కేటాయించి ఖర్చు చేస్తాం. అధికారంలోకి వచ్చిన మొదటి యేడాదిలోనే మైనారిటీల కలైన ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి తీరుతాం.
షేక్.గులాబ్ షాబి : ముస్లింలలో మీకు ఏ ట్రెడిషన్ నచ్చుతుంది.?
లోకేష్ : రంజాన్ మాసంలో మీకున్న పట్టుదల చాలా గొప్పది. నమాజ్ చేసే సమయం వస్తే అన్ని పనులు ఆపుకుని నమాజ్ చేస్తారు. క్రమశిక్షణ, పట్టుదల ఇస్లాం నేర్పించింది..మీ పట్టుదల, క్రమశిక్షణ ఇష్టం.
ప్రశ్న : హజ్ హౌస్ కడపలో నిర్మించారు. కట్టడం వరకే ఉంది..కార్యకలాపాలు ప్రారంభించలేదు. విజయవాడలోనూ నిర్మాణం తలపెట్టారు. హజ్ హౌస్ చూడాలంటే హైదరబాద్ వెళ్లాలా.?
లోకేష్ : హైదరాబాద్ లో హజ్ హౌస్, హజ్ టెర్మినల్ నిర్మించింది చంద్రబాబే. ఏపీలోనూ రూ.25 కోట్లతో కడపలో హజ్ హౌస్ నిర్మాణం చేపట్టాం. అధికారంలోకి వచ్చాక హజ్ యాత్రకు విజయవాడ నుండి విమాన సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తాం.
రెహీనా : మీ వైఫ్ తో తాజ్ మహాల్ చూడటానికి వెళ్లారా.? తాజ్ మహాల్ ను గిఫ్ట్ గా మీ భార్యకు ఇచ్చారా.?
లోకేష్ : తాజ్ మహాల్ చూడటానికి వెళ్లా..కానీ బ్రాహ్మణితో వెళ్లలేదు. పాదయాత్ర పూర్తయ్యాక బ్రాహ్మణీతో వెళ్తా..గిఫ్ట్ కూడా ఇస్తా.
మహబూబ్ ఆలీఖాన్, కర్నూలు : నా ఇంటిపై దాడి జరిగింది. మీరు నాతో ఫోన్లో కూడా గతంలో మాట్లాడారు. 3 సార్లు జైలుకు వెళ్లా. మా ప్రాంతంలో మసీదుపై నుండి ఓ పిల్లవాడు చనిపోతే బీమా వల్ల రూ. 5 లక్షలు వచ్చాయి. మీ ప్రభుత్వం వచ్చాక మళ్లీ బీమా ప్రవేశపెడతారా.?
లోకేష్ : ప్రమాదంలో ఎవరైనా చనిపోతే కుటుంబం రోడ్డున పడుతుంది. నంద్యాలలో ప్రమాదంలో భర్త చనిపోతే ఓ చెల్లికి చెక్కు ఇవ్వడానికి వెళ్లా. బీమా సొమ్ము వల్ల లక్ష అప్పుతీరిందని, ఆ బీమా లేకుంటే తాము రోడ్డుపై పడేవాళ్లం అని చెప్పింది. రూ.2 లక్షలున్న బీమా..తర్వాత రూ.5 లక్షలకు పెంచాం. వైఎస్ఆర్ బీమా అని పేరు మార్చుకున్నారు తప్ప..కానీ ఈ జగన్ బీమా పథకాన్ని చంపేశారు. చంద్రన్న బీమా పథకం మళ్లీ మేము ప్రవేశపెడతాం.
ప్రశ్న : విదేశీ విద్యను అభ్యసించేవాళ్లకు ఈ ప్రభుత్వం ఆర్థికసాయం చేయకపోవడంతో ఆస్తులమ్ముకుంటున్నారు. దీన్ని మళ్లీ మీరు ఏ విధంగా ప్రవేశపెడతారు.?
లోకేష్ : 600 మంది విద్యార్థులు దాదాపు విదేశాల్లో చదువుకునేందుకు అవకాశం కల్పించాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి యేడాది పూర్తి చేసిన వారిని రోడ్డుపై పడేసింది. అప్పులు చేసుకుని చదువులు పూర్తి చేసుకున్నారు. చదవడానికి స్థోమత లేక వెనక్కి వచ్చారు. విదేశీ విద్య పెండింగు బకాయిలు మేము వచ్చాక చెల్లిస్తాం.
మహ్మద్ తన్వీ : మేము మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాం. డిస్టెన్స్ లో చదువుతున్నా. కానీ దాన్ని కూడా చదవలేని వాళ్లు చాలా మంది ఉన్నారు. మైనారిటీ విద్యార్థులకు డిస్టెన్స్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ విధానం తీసుకువస్తే బాగుంటుంది. అందరూ చదువుకుంటే కర్నూలు సిటీలో సాఫ్ట్ వేర్ జాబులు చేయాలన్న ఆశ ఉంది.
లోకేష్ : ఐటీ వ్యవస్థలో కొత్తకొత్త టెక్నాలజీ వస్తోంది. స్కిల్ డెవలెప్మెంట్ పెట్టి నిధులు కేటాయించి, ట్రైనింగ్ ఇచ్చాం. డిస్టెన్స్ లో చదవేవాళ్లకూ ఫీజు రీయింబర్స్ విధానం పరిశీలిస్తాం. పాలనా సౌలభ్యం కోసం పాలన ఒకచోట..అభివృద్ధి వికేంద్రీకరించాలని నిర్ణయించాం. ఏ జిల్లాకు ఏం చేయాలో నిర్ణయించాం 18 నెలల్లోనే ఓర్వకల్లు విమాశ్రయం నిర్మించాం. జిల్లాలో రెండు సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేశాం. సోలార్ విద్యుత్ ను కూడా కర్నూలులో తెచ్చకున్నాం. 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలిచ్చారు..ఏం చేశారు..కర్నూలుకు.? ఒక్క పరిశ్రమైనా తీసుకొచ్చారా? కర్నూలు విమానాశ్రయ ప్రారంభాన్ని జగన్ రెండో సారి ప్రారంభించారు. 2 ఎంపీ స్థానాల్లో, 14 ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీని గెలిపించండి..కర్నూలును నెంబర్ 1 చేస్తాం.
Also, read this blog: Stride for Change: Yuvagalam Padayatra
Tagged: #LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh