Latest News:

దళిత జాతికే కళంకం సునీల్‌ కుమార్‌ పులివెందుల వేషాలు కుప్పంలో చెల్లవు అఫిడవిట్‌లో చెప్పినవన్నీ నిజాలే : వైఎస్‌ షర్మిల
Nara Lokesh Padayatra

పాణ్యం నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం అడుగడుగునా మహిళలు హారతులు… యువత కేరింతలు యువనేత లోకేష్ పాదయాత్రకు విశేష స్పందన

పాణ్యం: రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 89వరోజు పాణ్యం అసెంబ్లీ నియోజవర్గంలో దుమ్మురేపింది. పాదయాత్ర పొడవునా అడుగడుగునా మహిళలు నీరాజనాలు పడుతూ యువనేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. రోడ్లవెంట యువనేత రాకకోసం మహిళలు, వృద్ధులు, యువకులు వేచిచూశారు. యువకులు బాణాసంచా కాలుస్తూ కేరింతలు కొడుతూ నినాదాలు చేశారు. రేమడూరు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్ర… పుసులూరు, బొల్లవరం, బస్తిపాడు, చినకొట్టాల మీదుగా పెదకొట్టాలకు చేరుకుంది. వాల్మీకి బోయలు, ఎస్సీలు, ఆయా గ్రామాల ప్రజలు యువనేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. బొల్లవరంలో మహిళలతో ముఖాముఖి సమావేశమై వారి సాధకబాధకలు విన్నారు. బొల్లవరం శివార్లలో కౌలురైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని చెప్పి యువనేత ముందుకు సాగారు. 89వరోజున యువనేత లోకేష్ 11.9 కి.మీ. నడిచారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1147.5 కి.మీ పూర్తిచేసుకొంది.

యువనేత లోకేష్ ఎదుట వ్యక్తమైన సమస్యలు:

హంద్రినది నుండి పైపులైను వేసుకేంటో పీకేశారు -దొన్నుపాటి తిమ్మారెడ్డి, పుసులూరు గ్రామం

సాగునీటి కోసం హంద్రినది నుండి పొలానికి రూ.1.5 లక్షలు ఖర్చు చేసి నాలుగేళ్ల క్రితం పైపులైను వేసుకున్నాం. పరమేశ్వరరెడ్డి, వెంకట్రామిరెడ్డి, రమణారెడ్డి, కమలాకర్ రెడ్డి అనే నలుగురి పొలాల గుండా పైపులైను వేసుకున్నా. తర్వాత ఆ నలుగురు వైసీపీలోకి వెళ్లారు. నన్ను కూడా వైసీపీలోకి రమ్మన్నారు. నేను రానని చెప్పినందుకు పైపులైను అంతా తొలగించారు. మళ్లీ ఇప్పుడు వేయాలంటే రూ.3 లక్షలకు పైనే అవుతుంది. గ్రామాల్లో వైసీపీ నేతల అరాచకాలు తట్టుకునేవిగా లేవు.

నా భర్తపై తప్పుడు కేసులు పెట్టాలని చూశారు! -పాతింటి లక్ష్మీ, రేమడూరు గ్రామం

మేము వాల్మీకీలం. నా భర్తను తప్పుడు కేసుల్లో ఇరికించాలని వైసీపీ నేతలు ప్రయత్నించారు. ఐదు నెలల క్రితం నా భర్తపై వైసీపీ నేతలు తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నించారు. మా పొలంలో జింక చనిపోయింది. చనిపోయిన జింకను నా భర్త తిన్నారని, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఊర్లోకి వచ్చి గోల చేశారు. ఆ జింకను మేము తినలేదని ఎంత మొత్తుకున్నా వినలేదు. స్టేషన్ కు తీసుకుని వెళ్లారు. అవసరమైతే పొట్ట కోసుకుని చూసుకోండని, లేదంటే డాక్టర్ల దగ్గర టెస్టులు చేయించుకునేందుకైనా సిద్ధమని గట్టిగా చెప్పడంతో వదిలేశారు.

మహిళల గౌరవంపై కెజి నుంచి పిజి వరకు పాఠ్యాంశాలు! మహిళల స్వయం ఉపాధికి ప్రత్యేక కార్యాచరణ చేపడతాం పెట్రోలు, డీజిల్ తో సహా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాం మహిళలతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్

పాణ్యం: టిడిపి అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణకు చట్టాలు మాత్రమే కాదు, మహిళల్ని గౌరవించడం చిన్నప్పటి నుండే నేర్పిస్తాం. మహిళల గొప్పతనం, వారి కష్టం అందరికీ తెలిసేలా కేజీ నుండి పీజీ వరకూ ప్రత్యేక పాఠ్యాంశాలు తీసుకొస్తామని యువనేత నారా లోకేష్ చెప్పారు. పాణ్యం నియోజకవర్గం బొల్లవరంలో మహిళలతో ముఖాముఖిలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… ఫ్యాన్ ఆరోగ్యానికి హానికరం. ఫ్యాన్ ఆపేస్తే మహిళలకు మంచి రోజులు వస్తాయి. దిశ చట్టం పెద్ద మోసం. అసలు చట్టమే లేకుండా స్టేషన్లు ప్రారంభించారు. వైసిపి నాయకులే మహిళల్ని అసెంబ్లీ సాక్షి గా అవమానపరుస్తున్నారు. అందుకే మహిళల పై దాడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయి.

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాం!

అమ్మ ఒడి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామని జగన్ మోసం చేసాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఊసే లేదు. జగన్ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి ఒక కారణం పెట్రోల్, డీజిల్ ధరలు. దేశంలోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఏపి లో ఉన్నాయి. జగన్ బాదుడే బాదుడు కి ప్రజలు అల్లాడుతున్నారు. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు పెంచారు, ఆర్టీసి ఛార్జీలు 3 సార్లు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను వేసారు. TDP అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గించి ధరలు తగ్గేలా చేస్తాం. నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల భారం తగ్గిస్తాం.

మహిళల స్వయం ఉపాధికి కార్యాచరణ

డ్వాక్రా వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారు. వడ్డీ లేని రుణాలు ఇస్తాం అని మోసం చేశారు. ఆఖరికి మీరు దాచుకున్న అభయహస్తం డబ్బులు రూ.2500 కోట్లు కూడా జగన్ ప్రభుత్వం కొట్టేసింది. మహిళల స్వయం ఉపాధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. మంగళగిరి లో మహిళలకు టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చాం. అక్కడితో ఆగకుండా ఒక మార్కెట్ లింకేజ్ చేసాం. అన్ని రంగాల్లో మహిళల్ని ప్రోత్సహించే విధంగా ప్రోత్సహిస్తాం. సబ్సిడీ రుణాలు అందజేసి మహిళా పారిశ్రామిక వేత్తలుగా మారేందుకు సహకరిస్తాం.

విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారు!

విద్యా వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఫెయిల్ అయ్యాయి. టిడిపి హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో భాగంగా ఫీజులు నేరుగా కాలేజీలకు చెల్లించాం. జగన్ పాలనలో ఫీజులు నేరుగా తల్లుల ఖాతాలో వేస్తామని చెప్పి చెల్లించడం లేదు. విద్యా దీవెన, వసతి దీవెన వలన తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కాలేజీలకు బకాయి పడ్డ ఫీజులు అన్ని సింగిల్ సెటిల్మెంట్ చేసి విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇప్పిస్తాం.

మద్యనిషేధంపై మడమతిప్పాడు!

జగన్ సంపూర్ణ మద్యపాన నిషేదం చేస్తానని మోసం చేశాడు. మద్యపాన నిషేదం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు ఇప్పుడు ఎం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. మందుపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చాడు. జె-బ్రాండ్ లిక్కర్ తయారు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. జే బ్రాండ్ లిక్కర్ విషం కంటే ప్రమాదం. డబ్బు పిచ్చితో ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు. ఆ మద్యం తాగితే పైకి పోవడం ఖాయం.

మహిళలు మాట్లాడుతూ…

ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు కావడం లేదు. ప్రభుత్వం ఫీజులు చెల్లించక కాలేజీలు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు. దిశ చట్టం అంటూ మోసం చేశారు. డ్వాక్రా సంఘాలను జగన్ నిర్వీర్యం చేశారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వడం లేదు. జగన్ మద్యపాన నిషేదం చేస్తానని మోసం చేశారు. వైసిపి పాలనలో నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల భారం విపరీతంగా పెంచేశారు.

మహిళలతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు:

రాధిక : నేను పొదుపులక్ష్మీ గ్రూపులో లీడర్ గా ఉన్నా. ఎన్నికల సమయంలో రుణమాఫీ అని జగన్ హామీ ఇచ్చారు..కానీ చేయలేదు. మీరొచ్చాక పొదుపులక్ష్మి  మహిళలకు న్యాయం చేయండి.

మౌనిక : నేను 2021లో బీటెక్ పూర్తి చేశాను. చివరి సంవత్సరం ఫీజు రీయింబర్స్ మెంట్ రాలేదు. దీంతో బకాయిలు చెల్లించాలని యాజమాన్యం వత్తిడి తెస్తోంది. ఉద్యోగాలకు వెళ్లాలంటే సర్టిఫికేట్లు అవసరం అవుతున్నాయి. ఈ సమస్యకు మీరు పరిష్కారం చూపించండి.

నాగమణి : దిశ చట్టం అని జగన్ అన్నారు. దిశ చట్టంతో న్యాయం అంటున్నారు గానీ న్యాయం జరగడం లేదు. దిశ చట్టం అమల్లో లేదు. మీరొచ్చాక మహిళలకు రక్షణ కల్పించండి.

కృష్ణవేణి : మా అక్క చనిపోయింది. ఆమె కూతురు వికలాంగురాలైనా వివాహం చేశాను. ఇద్దరు పిల్లలున్నారు. తాగితాగి ఆమె భర్త చనిపోయారు. వచ్చే పెన్షన్ తో ఇల్లు గడవదు. ఇద్దరు పిల్లలను పోషించాలన్నా ఇబ్బందిగా ఉంది. సొంత ఇల్లులేదు. ఎన్నిసార్లు స్థలంకోసం అర్జీలు పెట్టినా ఇవ్వడం లేదు.

ఎమ్.నాగేశ్వరి, ప్రైవేట్ టీచర్ : ప్రైవేట్ టీచర్స్ కు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి కొంతమేర పెన్షన్ ఇచ్చే విధానం తీసుకురండి.

కృష్ణమ్మ : నిత్యవసర సరుకులన్నీ పెరిగాయి. Nara Chandrababu Naidu ఉన్నప్పుడు బాగా బతికాం. రూ.200 కూలీతో ఎలా బతకాలి.? మందు రేటు పెంచడంతో తెచ్చుకున్న సొమ్మును కూడా మా భర్తలు తాగి కాజేస్తున్నారు.

శ్రీదేవి : మా అమ్మాయి ఫార్మసీ చివరి సంవత్సరం చేస్తోంది. నేను జాయిన్ చేసిన మొదట్లో 6 ఏళ్ల పాటు ఫ్రీ అన్నారు. తర్వాత నాలుగేళ్లే అన్నారు..కానీ ఇప్పుడు ఆరో యేటలో రూ.2.20లక్షలు కట్టాలని చెప్తున్నారు.

హసీనా : అన్ని కళాశాలల్లో జర్నలిజం ఏర్పాటు చేయాలి. డిగ్రీలో ఒక సబ్జెక్టును ఏర్పాటు చేయాలి. ప్రజా ప్రతినిధులు దగ్గర జర్నలిజం చేసిన వాళ్లనే  పీఆర్వోగా పెట్టాలి.

నాగలక్ష్మి : గతంలో 200 తీసుకెళ్తే ఇంట్లోకి సరిపడా సరుకులు వచ్చేవి. ఇప్పుడు రూ.2 వేలు తీసుకెళ్లినా రావడం లేదు. బుడగజంగాల సామాజికవర్గానికి చెందిన మేము దశాబ్దాల క్రితం ఊరి చివర ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాం. దానికి పట్టా చూపించాలని, లేకుంటే కూల్చేస్తామని బెదిరిస్తున్నారు.

కృష్ణమ్మ : నాకు పెన్షన్ ఎప్పటి నుండో వస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చిన మొదట్లో ఇచ్చారు. తర్వాత కరెంటు మీటర్ ఎక్కువగా తిరుగుతోందని పెన్షన్ తొలగించారు.

పత్తిచేనును పరిశీలించిన యువనేత లోకేష్

పాణ్యం నియోజకవర్గం బొల్లవరం శివార్లలో పత్తిచేలోకి దిగిన యువనేత లోకేష్ అక్కడ మహిళారైతును కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళారైతు మల్లేశ్వరి మాట్లాడుతూ… రెండెకరాల కౌలుకు తీసుకొని పత్తిపంట వేశాం. కల్తీ విత్తనాల బెడద ఎక్కువగా ఉంది, పంట చేతికొచ్చేవరకు నమ్మకం లేదు. కూలీఖర్చులు, పురుగుమందుల ధరలు విపరీతంగా పెరిగాయి. గతఏడాది మొక్కజొన్న వేస్తే నష్టం వచ్చింది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరగడంతో భారంగా బతుకుబండి లాగుతున్నాం. ఇప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి సాయం లేకపోతే వ్యవసాయం చేయడం కష్టం.

లోకేష్ మాట్లాడుతూ…

ఎన్నికల సమయంలో ఏదేదో చేస్తానని కల్లబొల్లి కబుర్లు చెబుతూ ముద్దులు పెట్టిన జగన్… ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. వైసిపి నేతల కనుసన్నల్లోనే కల్తీవిత్తనాల మాఫియా నడుస్తోంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించేలా చర్యలు తీసుకుంటాం. నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గిస్తాం… ఒక్క సంవత్సరం ఓపికపట్టండి. రాబోయే చంద్రన్న ప్రభుత్వం రైతులు, కౌలురౌతులకు అండగా నిలస్తుంది.

అరక దున్నుతూ రైతన్న కష్టాలు తెలుసుకున్న లోకేష్

బొల్లవరం శివారులో చంటిబిడ్డను కాడిమధ్య ఉయ్యాలలో వేసి, సేద్యం చేస్తున్న రైతును యువనేత లోకేష్ కలిశారు. ఈ సందర్భంగా యువనేత లోకేష్ అరక దున్నుతూ రైతన్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతు మౌలాలి మాట్లాడుతూ… 3ఎకరాలు కౌలుకు తీసుకొని గతంలో మొక్కజొన్న వేశాను. రూ.80వేలు పెట్టుబడి అయితే, వచ్చిన పంట పెట్టుబడికి సరిపోయింది. మూడెకరాలకు రూ.60వేలు చేతిడబ్బులు కట్టాను. పంటనష్టపోయినపుడు అరకొర పరిహారం వచ్చినా అది భూయజమానులే తీసుకుంటున్నారు. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది… మీరు అధికారంలోకి వచ్చాక మాలాంటి వారిని ఆదుకోండి.

యువనేత లోకేష్ మాట్లాడుతూ…

రాష్ట్రంలో వ్యవసాయంపై అవగాహనలేని ముఖ్యమంత్రి కారణంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అకాలవర్షాల కారణంగా పంటలు నష్టపోతే కనీసం పొలాలను పరిశీలించే నాధుడులేడు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కౌలురైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం. పంట పెట్టుబడులను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. రైతులకు రాయితీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందజేస్తాం. పాత క్రాప్ ఇన్సూరెన్స్ విధానాన్ని పునరుద్దరించి, పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకుంటాం. ఒక్క ఏడాదిలో చంద్రన్న ప్రభుత్వం రాబోతోంది… మీ అందరి కష్టాలు తీరుస్తారు.

యువనేతను కలిసిన రేమడూరు గ్రామస్తులు

పాణ్యం నియోజకవర్గం రేమడూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో బోయ వాల్మీకి కమ్యూనిటీ హాలు నిర్మించాలి. బోయలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. చట్టసభల్లో బోయలకు అవకాశం ఇవ్వాలి. హంద్రీ నదిలో చెక్ డ్యామ్ కట్టి నీటికొరత తీర్చాలి. గ్రామంలో పొలాలకు వెళ్లేందుకు రోడ్డు సదుపాయం కల్పించాలి. రేమడూరు నుండి నాగలాపురం వరకు లింకు రోడ్డు, రేమడూరు నుండి కొంగనపాడు వరకు తారురోడ్డు వేయాలి. నాయకల్లు నుండి లద్దగిరి వరకు తారురోడ్డు వేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

టీడీపీ హయాంలో బోయలకు కమ్యూనిటీ హాళ్ల నిమిత్తం నిధులు, స్థలాలు ఇచ్చి నిర్మాణాలు చేపట్టాం. వైసిపి ప్రభుత్వం వచ్చాక వాటి పనులు నిలిపేసి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు. బోయలను ఎస్టీల్లో చేర్చే అంశంపై సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా న్యాయం చేస్తాం.  టిడిపి అధికారంలోకి వచ్చాక అసంపూర్తిగా నిలచిపోయిన కమ్యూనిటీ హాళ్లు పూర్తిచేసి, అవసరమైన చోట కొత్తవాటిని నిర్మిస్తాం. వైసీపీ పాలనలో గ్రామీణాభివృద్ధి పూర్తిగా పడకేసింది. టిడిపి అధికారంలోకి వచ్చాక ఇంటర్నల్, లింకు రోడ్ల నిర్మాణం చేపడతాం.

యువనేతను కలిసిన ఎస్సీ సామాజిక వర్గీయులు

పాణ్యం నియోజకవర్గం పుసులూరు గ్రామ దళితులు యువనేతను లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. గత ప్రభుత్వంలో అమలుచేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను జగన్ అధికారంలోకి వచ్చాక రద్దుచేశారు. ఎస్సీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. చట్టసభల్లో అత్యున్నత పదవులు ఇవ్వాలి. కల్లూరు మండలంలో ఎస్సీ హాస్టల్ నిర్మించాలి. పాణ్యం నియోజకవర్గంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించాలి. గ్రామంలో వాటర్ ట్యాంకు, ఎస్సీ కాలనీలో ప్రత్యేక వాటర్ పైప్ లైన్ ఏర్పాటుచేయాలి. గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

దళితులకు గత ప్రభుత్వం అమలు చేసిన 27 సంక్షేమ పథకాలు రద్దుచేయడమేగాక, రూ.28,147కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన వైసీపీ జగన్ రెడ్డి. దళితుల ఓట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్ అధికారంలోకి వచ్చాక మోసగించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక గతంలో అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం. ప్రతియేటా జాబ్ క్యాలెండర్ ద్వారా యువతకు ఉద్యోగాలు ఇస్తాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు ఇచ్చి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. దళితులను లోక్ సభ, శాసనసభ స్పీకర్లను చేసిన ఘనత చంద్రబాబుది. రాజకీయంగా ప్రాధాన్యతనిస్తాం. పుసులూరు గ్రామంలో వాటర్ ట్యాంక్, వాటర్ లైన్, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తాం. పాణ్యం నియోజకవర్గంలో ఎస్సీ సంక్షేమ హాస్టల్ నిర్మాణానికి చర్యలు చేపడతాం.

లోకేష్ ను కలిసిన బొల్లవరం గ్రామస్తులు

పాణ్యం నియోజకవర్గం బొల్లవరం గ్రామస్తులు యువనేతను లోకేష్ ను కలిసి సమస్యలను విన్నివించారు. మా గ్రామానికి 180 మీటర్ల దూరంలో శ్మశానవాటిక ఉంది. నాలుగేళ్లుగా పంచాయతీవారు చెత్తను శ్మశానంలో డంప్ చేస్తున్నారు. శ్మశానానికి వెళ్లడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోంది. ఈ విషయాన్ని పంచాయతీ, మండల అధికారులకు చెప్పినా ఫలితం శూన్యం. చెత్త వల్ల కాలుష్యం అధికమై గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యను పరిష్కరించాలి.

లోకేష్ స్పందిస్తూ…

పోరాటాల పురిటగడ్డ బొల్లవరంలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. ఉద్యమ వీరులకు నా జోహార్లు. టిడిపి అధికారలోకి వచ్చిన వెంటనే బొల్లవరం గ్రామాన్ని అభివృద్ది చేస్తాం. అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అందిస్తాం. జగన్మోహన్ రెడ్డి పాలనలో శ్మశానాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. వైసీపీ నాయకులు శ్మశానాలను కూడా వదలకుండా ఆక్రమిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ప్రహరీగోడలు నిర్మించి శ్మశానాలు ఆక్రమణలకు గురికాకుండా చూస్తాం. చెత్త వేసేందుకు డంపింగ్ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.

యువనేతను కలిసిన పందిపాడు గ్రామప్రజలు

పాణ్యం నియోజకవర్గం పందిపాడు గ్రామ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. 2019 ఎన్నికల్లో మా గ్రామాన్ని మున్సిపాలిటీలో చేర్చుతామని హామీ ఇచ్చారు. తాగునీటి సదుపాయం కల్పించి, ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. మా గ్రామాన్ని 2021లో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ విలీనం చేశారు. కానీ నేటికీ తాగునీటి సదుపాయం కల్పించలేదు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు తాగునీటి సమస్యను పరిష్కరించాలి.

లోకేష్ స్పందిస్తూ….

జగన్మోహన్ రెడ్డి పాలనలో గుక్కెడు నీరందక ప్రజలు అల్లాడుతున్నారు. ఓట్ల కోసం ఇష్టమొచ్చినట్లు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక గాలికొదిలేశారు. విలీనం గ్రామాల్లో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆయా కార్పొరేషన్లదే. కేవలం పన్నుల కోసమే పరిసర గ్రామాలను కలిపేసి, తర్వాత వదిలివేయడం దుర్మార్గం. ఆస్తివిలువ ఆధారిత ఇంటి పన్ను, చెత్తపన్ను, నీటి పన్ను అంటూ రకరకాల పన్నులతో నడ్డివిరుస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పందిపాడు గ్రామంలో నీటి సదుపాయాన్ని కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన చిన్నకొట్టాల గ్రామస్తులు

మా గ్రామంలో 1500మంది జనాభా ఉన్నారు. తాగు, సాగు నీటి సమస్య అత్యధికంగా ఉంది. మా గ్రామంలోని చెరువు నిండితే తప్ప మాకు నీరు దొరికే పరిస్థితి లేదు. వేసవిలో వాటర్ ట్యాంకర్ తో నీళ్లు కొనుక్కునే దుస్థితి నెలకొంది. మా గ్రామంలోని చిన్నతిప్పరాయని రిజర్వాయర్ నిర్మిస్తే ఉపయోగంగా ఉంటుంది. రిజర్వాయర్ నిర్మాణం వల్ల మా గ్రామంతో పాటు చుట్టుపక్కల 5 గ్రామాల సమస్య తీరుతుంది. మీరు అధికారంలోకి వచ్చాక మాకు నీటి సమస్యకు పరిష్కారం చూపాలి.

లోకేష్ స్పందిస్తూ….

జగన్మోహన్ రెడ్డి పాలనలో రాయలసీమ ప్రజలకు గుక్కెడు నీరు దొరకడం కష్టతరంగా మారింది. ఒక్క ఛాన్స్ ఇస్తే సమస్యలు తీరుతాయని ఆశపడిన ప్రజలకు మరిన్ని సమస్యలు పెరిగాయి. టిడిపి అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చాక సాగు, తాగు నీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం. రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తిచేసి సాగు, తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపిస్తాం.

లోకేష్ ను కలిసిన పెదకొట్టాల గ్రామస్తులు

పాణ్యం నియోజకవర్గం పెద్దకొట్టాల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. మాగ్రామ రైతులు నకిలీ పత్తివిత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులకు న్యాయం చేయండి. గ్రామంలో ముస్లిం శ్మశాన వాటికను అభివృద్ధి చేయండి. ఊరిమధ్యలో ఎండిపోయిన బావి కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పెద్దకొట్టాలలో శిథిలావస్థకు చేరిన స్కూలు స్థానంలో కొత్తది నిర్మించండి. గ్రామంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించండి.

లోకేష్ మాట్లాడుతూ….

వైసీపీ పాలనలో నకిలీ విత్తనాల మాఫియా కారణంగా లక్షలాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. టిడిపి అధికారంలోకి వచ్చాక విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం. నకిలీవిత్తనాలతో రైతులు నష్టపోతే సంబంధిత కంపెనీలనుంచి నష్టపరిహారాన్ని ఇప్పిస్తాం. గ్రామీణాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుంది. పెదకొట్టాల గ్రామంలో ముస్లిం శ్మశాన వాటిక, స్కూలు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తాం.

Also, read this blog: Embark on a journey of youth with Yuvagalam Padayatra

Tagged#LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *