900 కి.మీ. మైలురాయిని అధిగమించిన యువగళం పాదయాత్ర గుండాల ప్రాజెక్టు నిర్మాణానికి యువనేత లోకేష్ శిలాఫలకం, డోన్ నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం, అడుగడుగునా యువనేతకు జన నీరాజనం, ఘనస్వాగతం
డోన్: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం 70వరోజు పాదయాత్ర డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో 900 కి.మీ. మైలురాయిని చేరుకుంది. ప్యాపిలి బిసి కాలనీలో యువగళం 900 కి.మీ. మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఆలూరు, పత్తికొండ, డోన్, బనగానపల్లె నియోజకవర్గాల ప్రజలకు తాగు, సాగు నీరందించే గుండాల ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని యువనేత హామీ ఇచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ప్రకటించిన యువనేత… ఇందుకు గుర్తుగా ప్యాపిలి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గుడిపాడు క్యాంప్ సైట్ నుంచి 70వరోజు పాదయాత్ర అభిమానుల కేరింతల నడుమ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దారిపొడవునా జనం యువనేతకు నీరాజనాలు పలికారు. మార్గమధ్యంలో ఉద్యానవన, వేరుశెనగ రైతుల వద్దకు వారి సమస్యలు తెలుసుకున్నారు. మార్గమధ్యంలో యాదవులు, మామిడి రైతులు యువనేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. మధ్యాహ్నం భోజన విరామానంతరం ప్యాపిలిలో స్థానిక మహిళలు, వృద్ధులు, యువకులు లోకేష్ ను చూసేందుకు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరించిన యువనేత వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్యాపిలి శివార్లలో నిర్వహించిన బహిరంగసభకు జనం పోటెత్తారు.
టిడిపి ప్రభుత్వానికి రుణపడి ఉంటా! -పి.చిన్నసుంకన్న, సంజీవపురం, ప్యాపిలి మండలం
నేను 9 ఏళ్ల క్రితం మామిడి సాగు ప్రారంభించా. నాకు చంద్రబాబు సీఎంగా ఉన్న 2018 సంవత్సరంలో సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద మామిడి ప్యాక్ హౌస్ సబ్సీడీలో వచ్చింది. దాని మొత్తం విలువ రూ.4.10 లక్షలు కాగా ప్రభుత్వం నుండి రూ.2 లక్షల రాయితీ వచ్చింది. 2018 నవంబర్ చివరి వారంలో నిర్మాణం మొదలు పెట్టి..2019 ఫిబ్రవరిలో పూర్తైంది. మామిడి కాయలు కోత కోసిన ప్రతిసారీ ఈ హౌస్ లోనే ప్యాకింగ్ చేస్తున్నాం. ఈ హౌస్ లేనప్పుడు రూ.5వేలు అద్దె చెల్లించి, ప్యాకింగ్ చేసేవాళ్లం. హౌస్ లేనప్పుడు చెట్లకింద కాయలు ఉంచేవాళ్లం. ప్యాకింగ్ హౌస్ నిర్మించాక ధరల్లేని సమయంలోనూ సుమారు 15 రోజుల పాటు మా వద్దే ఉంచుకునే సౌకర్యం ఉంది. డ్రిప్, పైపులు కూడా నాకు టీడీపీ ప్రభుత్వంలో వచ్చాయి. TDP ప్రభుత్వానికి రుణపడి ఉంటా.
ఆరు నెలలు పనిచేస్తే..ఆరు నెలలు ఇంటి వద్దే ఉంటా -ఎమ్.మద్దిలేటి, రాచర్ల
నేను కెసీపీ అగ్రిటెక్ లో మార్కెటింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తా. అందులో ఆరు నెలలు ఉద్యోగం చేస్తే..మరో ఆరు నెలలు ఖాళీగా ఉండాల్సిందే. ఆ ఆరు నెలలు కూడా ప్రకాశం, గుంటూరు జిల్లా వెళ్లి పనిచేయాల్సి వస్తోంది. కంపెనీ ఇచ్చే రూ.20 వేలల్లో సగం ఖర్చులకే సరిపోతున్నాయి. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మాలాంటి వారికి ఇబ్బందులు తప్పుతాయి. టిడిపి ప్రభుత్వం వచ్చాక స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోండి.
జీతాలు పెంచాలని అడిగితే వైసీపీ నేతలతో బెదిరిస్తున్నారు -బి.వెంకటేశ్వర్లు, ప్యాపిలి.
ఓ ప్రైవేట్ సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తున్నా. 15 ఏళ్ల క్రితం సిమెంట్ కంపెనీకి మాకున్న 3 ఎకరాల భూమిని ఇచ్చాం. కానీ దానికి పరిహారం రాలేదు. అదే కంపెనీలో నెలకు రూ.12 తీసుకుంటూ రామిల్ విభాగంలో పని చేస్తా. మాకు జీతాలు పెంచడం లేదు. అడిగితే స్థానికంగా ఉన్న వైసీపీ నేతలతో బెదిరిస్తున్నారు. మంత్రికి నెలకు రూ.30 లక్షలను ఆ కంపెనీ ముడుపులు పంపిస్తోంది. ఆయన ముడుపుల కోసం మా కడుపులు కొట్టడం ఎంత వరకు సమంజసం?
అంబేద్కర్ జయంతి సాక్షిగా దళితులకు అవమానం వీడియో బయటపెట్టండి… లేదా దళితులకు సారీ చెప్పండి! సాక్షి అధినేత భారతీ రెడ్డికి యువనేత లోకేష్ సవాల్ , వైసిపి సైకోల్లారా… నన్ను కెలికితే మీకు కన్నీళ్లే! అవినీతి గురించి మాట్లాడితే అల్టిమేటమ్ ఇస్తారా? రాష్ట్రం పేదరికంలో ఉంటే జగన్ మాత్రం రిచ్, ముందు నోటీసులు… ఆపైన సెటిల్ మెంట్లు! ఊరికో సామంతరాజుతో అడుగడుగునా బుగ్గన దోపిడీ!అధికారంలోకి వచ్చాక డోన్ చెరువులకు హంద్రీనీవా నీళ్లు, ప్యాపిలి బహిరంగసభలో టిడిపి యువనేత లోకేష్
డోన్: అంబేద్కర్ జయంతి సందర్భంగా సాక్షి పత్రిక, ఛానెల్, వైసిపి నాయకులు, సాక్షి యజమాని భారతి రెడ్డి గారు దళితుల్ని అవమానపర్చారని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ప్యాపిలి బహిరంగసభలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం దళితులకు పీకింది, పొడిసింది ఏమి లేదు అని ఎస్సీల సమావేశంలో అంటే ఆ వీడియో ని ఫేక్ ఎడిట్ చేసి హడావిడి చేస్తున్నారు. 10 ఏళ్ల నుండి సాక్షి లో నా పై అనేక అసత్య వార్తలు రాస్తున్నారు. నేను వైసిపి నేతలకు, భారతి రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా. వాళ్ళు రాసిన వార్త కి సంభందించిన అసలైన వీడియో విడుదల చెయ్యాలి లేకపోతే దళితులకు క్షమాపణ చెప్పాలి. నేను ఇప్పటికే అసలైన వీడియో మీడియా కి విడుదల చేశాను. దళితుల్ని చంపుతున్న వైసిపి నేతలు నేను అవమానించానని మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
అవినీతి గురించి మాట్లాడితే అల్టిమేటమా?
వారు చేసే అవినీతి గురించి మాట్లాడకూడదని వైసిపి ఎమ్మెల్యేలు నాకు అల్టిమేటం జారీచేస్తున్నారు. వైసిపి సైకోలకు ఒకటే చెబుతున్నా… నన్ను కెలికితే మీకు కన్నీరే మిగులుతుందని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా ప్యాపిలిలో నిర్వహించిన బహిరంగసభలో లోకేష్ మాట్లాడుతూ… భయం నా బయోడేటా లో లేదు బ్రదర్స్. మీ లోకేష్ ఒక వారియర్. నేను ముందుగానే చెప్పా. సజావుగా సాగనిస్తే పాదయాత్ర, లేదంటే దండయాత్ర అని.
మహామహులు ఏలిన నేల డోన్!
డోన్ దద్దరిల్లింది. డోన్ దెబ్బకి వైసిపి నాయకుల దిమ్మతిరిగిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవ రెడ్డి గారు 1962 లో డోన్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నవ్యంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కేఈ కృష్ణమూర్తి గారు డోన్ నుండే ఎమ్మెల్యేలుగా గెలిచారు. మద్దిలేటి లక్ష్మినరసింహ స్వామి, గుండాల చెన్నకేశవస్వామి పుణ్యక్షేత్రాలు ఉన్న నేల ఈ డోన్. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న డోన్ నేల పై నడవడం నా అదృష్టం.అంబేద్కర్ గారి జయంతి సంధర్భంగా ఆయనకి నివాళులర్పిస్తున్నాను.
పేదవాడు పేదరికంలోనే ఉండాలా?
పేదవాడు ఎప్పడూ పేదరికంలో ఉండాలి అనేది వైసీపీ ప్రభుత్వం కోరిక. దానికి చక్కటి ఉదాహరణ సెంటు స్థలం స్కామ్. భూమి కొనుగోలు అంటూ పేదల పేరుతో కోట్లు కొట్టేసారు. ఆ భూమిని చదును చెయ్యడం, ఇళ్ల నిర్మాణం అంటూ వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. ముందు ఇళ్లు ఫ్రీ గా కట్టి ఇస్తాం అన్నారు. ఇప్పుడు ఇల్లు కట్టక పోతే పట్టా వెన్నకి తీసుకుంటాం అని బెదిరిస్తున్నారు. పేదవాళ్ళు అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నారు. ఈయన పెంచిన ఇసుక, సిమెంట్ ధరలతో ఇంటి నిర్మాణం కోసం 6 నుండి 10 లక్షల ఖర్చు అవుతుంది. అంటే పేదలు జీవితాంతం పేదరికంలో ఉండాల్సిందే.
యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
ఉద్యోగాలు ఇస్తే ఎక్కడ యువత రిచ్ అయిపోతారో అని వైసీపీ ప్రభుత్వం భయం. అందుకే ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. ఖైదీలకు 2 వేల రూపాయల మెస్ ఛార్జీలు ఇస్తుంటే, విద్యార్థులకు మాత్రం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.
ధనదాహంతో తాళిబొట్లు తెంచేస్తున్నాడు!
వైసీపీ ప్రభుత్వానికి ధన దాహం ఇంకా తీరలేదు అందుకే మహిళల తాళిబొట్లు కూడా కొట్టేస్తున్నాది. మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాది. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25వేల కోట్లు అప్పు తెచ్చాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాది. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం.
రైతులను కూడా దోచేస్తున్న వైసీపీ ప్రభుత్వం
వైసీపీ ప్రభుత్వం రైతుల్ని కూడా దోచేస్తున్నాది. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగుల మందులు అన్ని జగన్ బ్రాండ్లే. వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. మీకు తెలియకుండా మీ వస్తువు దొంగిలిస్తే దొంగ అంటాం. ఏకంగా పోలీసుల డబ్బులే కొట్టేసాడు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు.
బిసిలను చావుదెబ్బతీశాడు!
బీసీలను చావుదెబ్బ తీసాడు. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు.బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం.అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం.
మైనారిటీలనూ మోసగించిన వైసీపీ ప్రభుత్వం
మైనార్టీ సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. మైనారిటీలను వైసిపి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు.
రెడ్డిసోదరులు కూడా ఆలోచించాలి
డోన్ లో ఉన్న రెడ్డి సోదరులు కూడా ఒక్క సారి ఆలోచించండి. మీరు వైసీపీ ప్రభుత్వంని గెలిపించడం కోసం ఆస్తులు అమ్ముకున్నారు. ఇప్పుడు మీకు కనీస గౌరవం ఉందా? కేవలం పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి తప్ప మిగిలిన రెడ్లు ఎవరైనా బాగుపడ్డారా? ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఉన్న డోన్ కి ఇప్పుడు ఒక అసమర్ధ ఎమ్మెల్యే ఉన్నారు. అసెంబ్లీ లో ఆయన చెప్పిన అన్ని గాలి కధలు ఎవరూ చెప్పి ఉండరు. ఆర్థికశాఖ మంత్రి నియోజకవర్గం అంటే ఎలా ఉండాలి? అభివృద్ధి లో డోన్ నంబర్1 గా ఉండాలి. కానీ డోన్ పరిస్థితి చూస్తే నాకు బాధేస్తుంది.
డోన్ లో అభివృద్ధి నిల్లు… అవినీతి ఫుల్లు!
మీ ఎమ్మెల్యే గారి పేరు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి. డోన్ లో అభివృద్ధి నిల్లు…అవినీతి ఫుల్లు. ఈయన నియోజకవర్గంలో ఉండేది తక్కువ. ఢిల్లీ లో ఉండేది ఎక్కువ ఎందుకో తెలుసా అప్పు కోసం. అందుకే ఈయనకు అప్పుల అప్పారావు అని పేరు పెట్టా. అప్పుల అప్పారావు గారు అవినీతి లో మాత్రం తోపు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గనులు ఏమి వదలడం లేదు. ఆఖరికి కరోనా ని కూడా క్యాష్ గా మార్చుకున్నారు మన అప్పుల అప్పారావు. డోన్ నియోజకవర్గాన్ని కేకు ముక్కల్లా కోసి తన బంధువులకు పంచేసారు. ఇసుక ఒకరికి, మట్టి ఒకరికి, మైన్స్ ఒకరికి.
డోన్ లో యథేచ్చగా గంజాయి, మద్యం!
డోన్ పట్టణంలో మట్కా, అక్రమ మద్యం, గంజాయి విచ్చలవిడిగా ఏరులై పారుతోంది. ఈ దందా వెనుక ఉంది అప్పుల అప్పారావు అనుచరులే. ఒక మహిళా న్యాయవాది ఆటో లో వెళ్తుంటే గంజాయి మత్తు లో ఉన్న బ్లేడ్ బ్యాచ్ ఆమెని బెదిరించారు. అంటే ఇక్కడ ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్దం చేసుకోవచ్చు. అప్పుల అప్పారావు ప్రధాన అనుచరులైన కౌన్సిలర్ దినేష్, ప్రసాద్ కర్ణాటక నుండి మద్యం తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. సొంత పార్టీ నాయకులకు కూడా రక్షణ లేదు. వైసిపి నాయకుడు నాగార్జున రావు కి చెందిన 3 ఎకరాల భూమిని కబ్జా చేసారు అప్పుల అప్పారావు అనుచరులు. రాప్తాడు ఏరియాలో ఇండస్ట్రియల్ హబ్ దగ్గర బినామీ పేర్లతో ౩౦౦ ఎకరాలు కొన్నారు. ఆఖరికి పక్క రాష్ట్రం కర్ణాటక బాగల్కోట ఏరియాలో అక్రమ మైనింగ్ చేస్తుంది ఈ అప్పుల అప్పారావు ఫ్యామిలీ. వైసిపి మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది…. ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి లోకాయుక్తా కూడా సీరియస్ అయ్యింది అంటే ఎంత దారుణ పరిస్తితి ఉందో అర్థం చేసుకోవచ్చు.
పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
జగన్ పాదయాత్ర లో డోన్ కి వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. డోన్ ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మోడల్ నియోజకవర్గం దేవుడెరుగు. అస్సలు అభివృద్ధి జరగని నియోజకవర్గాల లిస్ట్ లో డోన్ ఒకటి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. హంద్రీనీవా జలాలతో డోన్ లో ఉన్న చెరువులు అన్ని నింపేస్తా అన్నాడు. నింపాడా? టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీనీవా జలాలు తీసుకొచ్చి ఇక్కడ చెరువులు నింపుతాం. నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. డోన్ లోని రుద్రాక్షల గుట్ట ప్రాంతంలో 15 సంవత్సరాలకు పైగా అక్కడ నివాసం ఉంటున్న సుమారు 1000 పేద కుటుంబాలను ప్రభుత్వ ఆసుపత్రి కట్టే నెపంతో ఖాళీ చేయించడం జరిగింది. వారు నిరసన వ్యక్తం చేయగా ప్రత్యామ్నాయంగా వేరే చోట నివాస స్థలాలు ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటి వరకూ దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు.
డోన్ ను అభివృద్ధి చేసింది టిడిపినే!
డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టిడిపి. సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసింది టిడిపి. గ్రామాల్లో సిసి రోడ్లు, పంచాయతీ భవనాలు, రోడ్లు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టిడిపి. డోన్ నియోజకవర్గంలో మామిడి, అరటి రైతుల కష్టాలు నాకు తెలుసు. సబ్సిడీ తో డ్రిప్, ప్యాక్ హౌస్ కోసం గతంలో ఇచ్చినట్టు 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. మైనింగ్, కలర్ స్టోన్ పాలిష్ ఫ్యాక్టరీల యజమానులు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు. రాయల్టీ మూడు రెట్లు పెంచేసారు. కరెంట్ బిల్లు నాలుగు రెట్లు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పన్నులు తగ్గించి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తాం. ప్యాపిలి మండలంలో 4 లైన్ రోడ్డు పనులు మొదలు పెట్టి ఆపేసారు ఆ పనులు మేము పూర్తి చేస్తాం. డోన్ లో పాలిటెక్నిక్ కళాశాల, ప్యాపిలి లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చెయ్యాలి అనే డిమాండ్ ఉంది. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే సానుకూల నిర్ణయం తీసుకుంటాం. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తాం. అప్పుల అప్పారావు గారు చాలా తప్పులు చేసారు. టిడిపి నాయకులను వేధించారు, కార్యకర్తల పై కేసులు పెట్టారు. జైలుకి పంపారు. నేను ఊరుకోను అప్పుల అప్పారావు అండ్ గ్యాంగ్ కి సరైన ట్రీట్మెంట్ ఇస్తా. మా నాయకులు, కార్యకర్తల జోలికి వచ్చిన అందరికి చుక్కలు చూపించడం ఖాయం. వడ్డీతో సహా చెల్లిస్తా.
యువనేతను కలిసిన గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య నాయకులు
గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య నాయకులు యువనేత నారా లోకేష్ కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో 1.76కోట్ల గొర్రెలు, 55.22లక్షల మేకలు ఉన్నాయి. గొర్రెలు,మేకల పెంపకానికి అవసరమైన పచ్చిక బయలు భూములు తగ్గిపోయాయి. ఎన్.సీ.డీ.సీ పథకంలో సబ్సిడీ 20శాతమే ఉంది. దాన్ని 75శాతానికి పెంచాలి. జీవాలకు షెడ్లు నిర్మించి ప్రకృతి విపత్తుల నుండి కాపాడాలి. గొర్రెలు,మేకల పెంపకందారులకు 50ఏళ్లకే పెన్షన్లు అందించాలి.
లోకేష్ స్పందిస్తూ…
బడుగు, బలహీన, అణగారిన వర్గాలను ఆదుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో సబ్సిడీపై గొర్రెలు, మేకల యూనిట్లను అందించాం. ఉచిత ఇన్సూరెన్స్ అందించి జీవాల పెంపకందారుల నష్టాలను తగ్గించాం. అధికారంలోకి వచ్చాక సబ్సిడీలు పెంచుతాం. జీవాలకు షెడ్లు నిర్మిస్తాం. 50ఏళ్లకు పెన్షన్లపై మ్యానిఫెస్టోలో స్పష్టతనిస్తాం.
యువనేతను కలిసిన మామిడి రైతులు
డోన్ నియోజకవర్గం, పోతుదొడ్డి, మానుదొడ్డి గ్రామాల మామిడి రైతులు యువనేతను కలిసి సమస్యలను విన్నవించారు. పోతుదొడ్డి, మానుడొడ్డి గ్రామాలతో పాటు ఇతర గ్రామాల్లోనూ మామిడి తోటలు అధికంగా ఉన్నాయి. మామిడిని ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాం. గిట్టుబాటు ధరలు లేని సమయంలో ఇబ్బందులు పడుతున్నాం. మామిడికి ధరల్లేనప్పుడు నిల్వ ఉంచుకోవడానికి స్టోరేజ్ గోడౌన్ ఏర్పాటు చేస్తే ఎంతో మంది రైతులకు మేలు జరుగుతుంది.
నారా లోకేష్ మాట్లాడుతూ…
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మామిడి రైతుల పరిస్థితి అగమ్యఘోచరంగా మారింది. పంట నష్టపోయిన వారిని కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు..టీడీపీ హయాంలో గిట్టుబాటు ధరకు అదనంగా రూ.2లు ఇచ్చి ఆదుకున్నాం. వైసీపీ నేతలు సిండికేట్లుగా మారి మామిడి రైతుల్ని దగా చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధరల్లేకపోయినా…వైసీపీ నేతలు కమీషన్లు దండుకుంటున్నారు. రాష్ట్రంలో మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి. ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు కేటాయిస్తానని హామీనిచ్చిన జగన్ మర్చిపోయారు. మేము అధికారంలోకి వచ్చాక మామిడి బోర్డు, స్టోరోజ్ గోడౌన్ ఏర్పాటుపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం.
యువనేతను కలిసిన హనుమంతురాయునిపల్లి గ్రామస్తులు
డోన్ నియోజకవర్గం హనుమంతురాయనిపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. గత మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయంలో నష్టాలు చూస్తున్నాం. కరువు మండలాలకు పరిహారం అందడం లేదు. గతంలో పంటబీమా, ఇన్ పుట్ సబ్సీడీ, కరువు చెక్కులు వచ్చేవి. గ్రామంలో ఉన్న నీటి సమస్య దృష్ట్యా చెరువు ఏర్పాటు చేయాలి. మా సమస్యలను పరిష్కరించి, గ్రామ రూపురేఖలు మార్చాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
కరువు పరిస్థితులు అంచనా వేసి గతంలో మండలాల వారీగా అదనంగా పనిదినాలు కల్పించాం. వైసీపీ ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో ఒక్కసారి మాత్రమే రైతులకు బీమా సొమ్ము అందించారు. ఇన్ పుట్ సబ్సీడీ ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి పట్టడం లేదు. హనుమంతురాయునిపల్లిలో ఎన్ఆర్జీసీ నిధులతో చెరువు ఏర్పాటుకు ప్రయత్నిస్తాం.
ఉద్యాన రైతును కలిసిన నారా లోకేష్
డోన్ నియోజకవర్గం, ప్యాపిలి నియోజకవర్గం, ప్యాపిలి గ్రామానికి చెందిన చిన్న సుంకన్న తన మామిడి తోటలో ఉన్న ప్యాక్ హౌస్ వద్ద కూర్చుని ఉండగా, లోకేష్ ఆ రైతును చూసి తన వద్దకు వెళ్లాడు. ప్యాక్ హౌస్ పై ఉన్న వివరాలు చూసి, దాని వల్ల జరుగుతున్న లాభాలు సదరు రైతును అడిగి తెలుసుకున్నారు. రైతు చిన్న సుంకన్న మాట్లాడుతూ… 2014-15 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5ఎకరాల పైబడి ఉద్యాన పంటలు పండించే రైతులకు ప్యాక్ హౌస్ లను నిర్మించారు. మొత్తం హౌస్ విలువ రూ.4.10లక్షలు. దీనిలో రైతుకు రూ.2లక్షలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించింది. ఈ హౌస్ నిర్మించుకోవడం వల్ల కోసిన పంట ప్రకృతి విపత్తులకు గురై పాడవకుండా కాపాడుకుంటున్నాం. గతంలో ఇవి లేనప్పుడు పంట మొత్తం పాడైపోయి విపరీతంగా నష్టపోయేవాళ్లం. 2018-19 సంవత్సరంలో నేను ఈ ప్యాక్ హౌస్ కట్టించుకున్నాను. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది. ప్యాక్ హౌస్ లేని ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
నారా లోకేష్ మాట్లాడుతూ…
చంద్రబాబుకు రైతులు ఎదుర్కొనే సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. కేంద్రం అందించే పథకాలకు, రాష్ట్ర నిధులను జత చేసి రైతులను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్ మెంట్ ఆఫ్ హార్టికల్చర్(ఎం.ఐ.డీ.హెచ్.) పథకంలో భాగమే ఈ ప్యాక్ హౌస్ ల నిర్మాణం. ఉద్యాన రైతులకు 90శాతం సబ్సిడీతో డ్రిప్ ఇచ్చి చంద్రబాబు ప్రోత్సహించారు. ఎవరికైతే ప్యాక్ హౌస్ లు లేక ఇబ్బందులు పడుతున్నారో అటువంటి రైతులను మేం అధికారంలోకి వచ్చాక ఆదుకుంటాం. గతంలో నిర్మించిన విధంగా ఉద్యాన రైతులకు సబ్సిడీపై ప్యాక్ హౌస్ లు నిర్మిస్తాం. ఉద్యాన రైతులకు కావాల్సిన యంత్రాలు, యంత్ర పరికరాలు, వ్యవసాయ పనిముట్లను అందిస్తాం.
వేరుశనగ రైతును కలిసిన నారా లోకేష్
డోన్ నియోజకవర్గం, ప్యాపిలి మండలం, ప్యాపిలి గ్రామంలో వేరుశనగ రైతు రామన్నను యువనేత నారా లోకేష్ కలిశారు. పాదయాత్రగా వెళ్తూ పొలంలో పని చేసుకుంటున్న రామన్న వద్దకు వెళ్లి వెంటనే రైతు వద్దకు వెళ్లి వ్యవసాయం ఎలా ఉందని వాకబు చేశారు. రైతు రామన్న మాట్లాడుతూ… నాకు 5 ఎకరాల పొలం ఉంది. వేరుశనగ పంట వేశాను. డ్రిప్ ఉండడం వల్ల పంట తీయగలుగుతున్నాను. టీడీపీ పాలనలో 90శాతంపై డ్రిప్ ఇచ్చేవాళ్లు. తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభాలు వచ్చేవి. నేడు డ్రిప్ మేమే కొనుక్కోవాల్సి వస్తోంది. వైసీపీ ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం లేదు. నకిలీ విత్తనాలు వల్ల పంట నష్టం జరుగుతోంది. మాకు మంచి విత్తనాలు, సబ్సిడీపై ఎరువులు, డ్రిప్ ఇస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
లోకేష్ స్పందిస్తూ…
రైతు ముఖంలో చిరునవ్వు చూడడమే టీడీపీ లక్ష్యం. గత పాలనలోనూ రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాం. 90శాతం సబ్సిడీపై డ్రిప్ తో పాటు, యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు కూడా సబ్సిడీపై అందించి రైతులను ఆదుకున్నాం. జగన్మోహన్ రెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేదు. రైతులు పడే కష్టాలు ఏమీ తెలియవు. అందుకే డ్రిప్ రద్దు చేశాడు. జేబులు నింపుకునేందుకు నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు అమ్మేవాళ్లను ప్రోత్సహిస్తున్నాడు. మేం అధికారంలోకి వచ్చాక రైతులకు గతంలో అమలు చేసిన పథకాలను పునరుద్ధరిస్తాం. రైతులను ఆదుకుని వ్యవసాయం లాభసాటి చేసేలా చర్యలు తీసుకుంటాం.
యువనేతను కలిసిన విఆర్ఎ సంఘం ప్రతినిధులు
యువనేత నారా లోకేష్ ను కలిసిన విఆర్ఎ సంఘం ప్రతినిధులు కలిసి సమస్యలు విన్నవించారు. రాష్ట్రవ్యాప్తంగా 25వేలమంది విఆర్ఎలు రెవిన్యూ శాఖలో దశాబ్ధాలుగా సేవలందిస్తున్నాం. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నా మాకు పేస్కేలు అమలుచేయడం లేదు. విఆర్ఎలకు కనీస వేతనంగా రూ.26వేలు ఇవ్వాలి. నామినీలుగా పనిచేస్తున్న వారిని విఆర్ఎలుగా నియమించాలి..
*యువనేత లోకేష్ స్పందిస్తూ…*
రాష్ట్రంలో అన్నిరకాల ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం ఇబ్బందుల పాల్జేస్తోంది. ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పనిచేస్తూ సేవలందిస్తున్న విఆర్ఎల న్యాయమైన డిమాండ్లకు టిడిపి మద్దతు ఇస్తుంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విఆర్ఎల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన ప్యాపిలి గ్రామస్తులు
జిల్లాలో ప్యాపిలి పెద్ద మండలం.మండలానికి నాలుగుదిక్కులా చెరువులున్నాయి. కానీ వాటిలో నీరు ఇంకిపోయింది. ఎండాకాలంలో నాలుగు రోజులకోసారి మాత్రమే నీళ్లు వస్తున్నాయి. కెసి ప్రధాన కాలువలు, తుంగభద్ర, కృష్ణా నదుల నుండి చెరువులకు ఎవరూ నీరు తీసుకురావడం లేదు. ప్యాపిలి గ్రామంలో 16వేల జనాభా ఉంది. వర్షాధార పంటలపైనే ఆధారపడ్డాం. ఫీజు రీయింబర్స్ మెంట్ లేక మా పిల్లలు ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్నారు. మా గ్రామంలోని చెరువులకు నీళ్లు, మా పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలి.
లోకేష్ స్పందిస్తూ….
నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు నీళ్లిచ్చిన వ్యక్తి చంద్రబాబు.పోలవరాన్ని పూర్తిచేసి మిగుల జలాలను రాయలసీమకు తీసుకురావాలని సంకల్పించారు. 72శాతం పోలవరం పనులు చంద్రబాబు పూర్తిచేస్తే, జగన్ రెడ్డి దాన్ని గోదావరిలో ముంచేశాడు. తాగు,సాగు నీళ్లు ఇవ్వడంపై జగన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. మేం అధికారంలోకి వచ్చాక నదుల అనుంసధానం ద్వారా రాయలసీమకు నీళ్లిస్తాం. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని పునరుద్ధరించి పేద,బడుగు,బలహీనవర్గాల విద్యార్థులకు ఉన్నతవిద్యను అందిస్తాం..
Also, read this blog: Nara Lokesh’s Rise to Success in Yuvagalam
Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh