Latest News:

దళిత జాతికే కళంకం సునీల్‌ కుమార్‌ పులివెందుల వేషాలు కుప్పంలో చెల్లవు అఫిడవిట్‌లో చెప్పినవన్నీ నిజాలే : వైఎస్‌ షర్మిల

ఎమ్మిగనూరులో దుమ్మురేపిన యువగళం అడుగడుగునా యువనేతకు నీరాజనాలు మాట ఇచ్చిన 2రోజుల్లో రంగమ్మకు చెక్కు యువగళానికి సంఘీభావంగా జనసేన కార్యకర్తలు

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర ఆదివారం దుమ్మురేపింది. 85వరోజు పాదయాత్ర ఎమ్మిగనూరు శివారు ఈఎన్ వి వే బ్రిడ్జి నుంచి ప్రారంమైంది. వరుణదేవుడు స్వాగతం పలుకగా యువనేత పాదయాత్ర ప్రారంభించరు. అడుగడుగునా మహిళలు, యువకులు, వృద్ధులు యువనేతకు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా గజమాలలతో సత్కరించి బాణాసంచా మోతలు, డప్పు శబ్ధాలతో హోరెత్తించారు. యువగళానికి సంఘీభావంగా జనసేన కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొని సందడి చేశారు. లెక్చరర్లు, విద్యార్థులు, ఎస్సీలు, ముస్లింలు తదితర సామాజికవర్గాలు అడుగడుగునా యువనేతకు ఎదురేగి స్వాగతం పలికారు. మాచాపురం ఇటీవల 12 ఎకరాల వ్యవసాయం చేసి తన భర్త ఆత్మహత్యచేసుకున్నాడని చెప్పిన రంగమ్మకు హామీ ఇచ్చిన రెండురోజుల్లోనే యువనేత ఆదివారం చెక్కు అందజేశారు. ఎమ్మిగనూరు బహిరంగసభలో రంగమ్మను పిలచి చెక్కు ఇచ్చి తమ మాట నిలబెట్టుకున్నారు. ఎమ్మిగనూరు శివసర్కిల్ లో యువకులు యువనేతకు భారీగా ఎదురేగి స్వాగతం పలికారు.

యువనేత ఎదుట వ్యక్తమైన అభిప్రాయాలు:

పనుల్లేక మళ్లీ వ్యవసాయం చేసుకుంటున్నా : రాము, రోడ్డు పనుల కార్మికుడు, నాగులదిన్నె

తారు, సిమెంట్ రోడ్లు వేయడానికి వెళ్తుండేవాన్ని. గతంలో ఎక్కువగా తారు రోడ్లు వేయడానికి వెళ్తే రూ.800 నుండి రూ.1000 దాకా కూలీ వచ్చేది. కానీ ఇప్పుడు ఎక్కడా రోడ్ల పనులు చేపట్టడం లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి మాత్రమే సిమెంట్ రోడ్డు పనికి వెళ్లా. సెంట్రింగ్ పని కూడా లేదు. వారంలో నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది. దాంతో వ్యవసాయం చేసుకుంటున్నా.

వేలిముద్ర వేయాలంటే కష్టంగా ఉంది

– వడ్డె లక్ష్మీ, పార్లపల్లి

పదిహేనేళ్ల క్రితం పుట్టిన నా మనవడుకి పుట్టుకతోనే ఒళ్లంతా పుండుగా మారింది. రోజూ కళ్లు, చర్మం వెంట కొంచం రక్తం వస్తుంది. ప్రభుత్వం నుండి మొదటి నుండీ పెన్షన్ వస్తోంది. కానీ చర్మం పాడవ్వడం వల్ల వేలిముద్రలు వేయాలంటే కష్టంగా ఉంది. వేలి ముద్రలు పడనప్పుడు పెన్షన్ నిలిపేస్తున్నారు. గతంలో ఒకరు పూచీగా ఉంటే పెన్షన్ ఇచ్చారు. నా మనవడికి వేలిముద్ర విధానం తీసేయాలి. రోగంతో పుట్టాడని వాళ్లనాన్న వదిలివెళ్లిపోయారు. నా కూతురు కూలీ పనులకు వెళ్తుంది. నేను పనిచేయలేక నలుగురి వద్ద డబ్బులు అడుక్కుని పోషించుకుంటున్నా.

ఇప్పుడు ధనిక జగన్, పేదలకు మధ్యే యుద్ధం! పేదల గొంతు వినిపించేందుకే యువగళం ఇడుపులపాయ కథలో ఈసారి ఎవరివంతో! జనంలోకి వచ్చే దమ్ము లేదు దోపిడీలో రూటే సపరేటు ఎమ్మిగనూరు బహిరంగసభలో యువనేత లోకేష్

ఎమ్మిగనూరు: పేదలు ఎప్పటికీ పేదలు గానే ఉండాలి అనేది దేశంలోనే ధనిక సీఎం జగన్ కోరిక. పేదరికం లేని రాష్ట్రం చూడాలన్నది మీ లోకేష్ కోరిక.  ధనిక సీఎం జగన్ కి పేదలకి మధ్య ఇప్పుడు యుద్ధం జరుగుతోందని యువనేత Nara Lokesh పేర్కొన్నారు. ఎమ్మిగనూరు చేనేత సొసైటీ గ్రౌండ్ లో జరిగిన భారీ బహిరంగసభలో యువనేత లోకష్ మాట్లాడుతూ… పేదల గొంతు వినిపించే వేదికే ఈ యువగళం. సీఎం ప్రజల్లో తిరిగే లోకేష్ ని అడ్డుకోవడానికి అనేక కుట్రలు చేసాడు.  పోలీసులతో వచ్చాడు అంబేద్కర్ గారి రాజ్యాంగం చూపించా.  నన్ను అడ్డుకోవడం నీ తరం కాదు. నువ్వు రోడ్డు మీద ధైర్యంగా తిరగడం సాధ్యం కాదు. మొన్న హెలికాఫ్టర్లో టెక్నికల్ ప్రాబ్లెమ్ వచ్చిందని రోడ్డు మార్గంలో వెళ్లాడు సీఎం. ధర్మవరం నియోజకవర్గంలో న్యాయం చెయ్యాలి అంటూ రైతులు సీఎం కాన్వాయ్ కి అడ్డం పడుకున్నారు. కనీసం ఆగకుండా రైతులను ఈడ్చిపడేసారు జగన్. ఒక్క క్షణం ఆగి వారి సమస్య వినే ఓపిక లేదు సీఎంకి.

వైసీపీ కు జ్వరం ఖాయం

ఎమ్మిగనూరు లో ప్రజల ఎనర్జీ చూసిన తరువాత వైసీపీ కి జ్వరం రావడం ఖాయం అని ఫిక్స్ అయ్యా. చేనేతకు పుట్టినిల్లు ఎమ్మిగనూరు. ఎమ్మిగనూరు చేనేతకు గుర్తింపు తెచ్చిన గొప్ప వ్యక్తి సోమప్ప గారు. ఎమ్మిగనూరు కి అభివృద్ధి ని పరిచయం చేసిన వ్యక్తి స్వర్గీయ బివి. మోహన్ రెడ్డి గారు.  శ్రీ నీలకంఠశ్వరస్వామి, శ్రీ రామలింగేశ్వరస్వామి, అల్లిపీరా దర్గా ఉన్న పుణ్యభూమి ఈ ఎమ్మిగనూరు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. నన్ను ఆపడం సాధ్యం కాదని జగన్ కి అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు భారతి రెడ్డి గారిని రంగంలోకి దింపాడు. లోకేష్ దళితుల్ని అవమానించాడు అంటూ ఒక ఫేక్ వీడియో తయారు చేసి సాక్షి లో హడావిడి చేసారు భారతి రెడ్డి గారు. అక్కడ మీటింగ్ లో ఉన్న దళితులు అంతా చప్పట్లు కొట్టారు.  నేను మరోసారి సవాల్ చేస్తున్నా అమ్మా భారతి రెడ్డి గారు నేను దళితుల్ని అవమానించినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా.  మీ వీడియో ఫేక్ అని తేలితే సాక్షి మీడియా మూసేస్తారా?

జగన్  కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్.  జగన్ యువత ను చీట్ చేసాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

మహిళల పసుపు కుంకుమ చెరిపేస్తున్నాడు.

జగన్ మహిళల పసుపు, కుంకుమ చెరిపేస్తున్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఎం అయ్యింది? సొంత బ్రాండ్లు అమ్ముకొని వేల కోట్లు సంపాదిస్తున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు.  అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు.  రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లుగా మారబోతున్నాయి. జగన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు.  వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది.

పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు.  బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. అందుకే బీసీల భద్రత కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం.అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం.

డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది. ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, లిక్కర్ స్కామ్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు.ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా? వైసిపి పాలనలో దళితులను చంపడానికి స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు. మైనారిటీలను మోసం చేసాడు జగన్. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లి బేగంబీ కి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. ఇప్పటికీ ఆ తల్లికి న్యాయం జరగలేదు. TDP హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు.

జగన్ నేను రాయలసీమ బిడ్డని అంటాడు కానీ ఆయన రాయలసీమ.  అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే. రాయలసీమ రైతులకు టిడిపి హయాంలో ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసాడు జగన్ రెడ్డి. ఎస్సి,ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం.  అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు. రిలయన్స్, అమరరాజా, జాకీ  వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు.

టిడిపి హయాంలోనే ఎమ్మిగనూరు అభివృద్ధి

ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధి మీద సైకిల్ బ్రాండ్ ఉంది. ఎమ్మిగనూరు టౌన్ లో రోడ్లు, తాగునీటి సమస్య తీర్చింది టిడిపి. గ్రామాల్లో సిసి రోడ్లు, పేదలకు ఇళ్లు కట్టింది టిడిపి. మీరు ఎం చేసారు? పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు.  రూ.1986 కోట్లతో టిడిపి హయంలో ప్రారంభించిన ఆర్డీఎస్ రైట్ కెనాల్ పనులు వైసిపి ప్రభుత్వం ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులు పూర్తి చేస్తాం.  గురురాఘవేంద్ర లిఫ్ట్ ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం రూ.15 కోట్లు ఇవ్వలేని చెత్త ప్రభుత్వం జగన్ ది. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత పనులు పూర్తి చేసి గురురాఘవేంద్ర లిఫ్ట్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తాం. టిడిపి హయాంలో ఎమ్మిగనూరు టౌన్ లో 3వేల టిడ్కో ఇళ్లు నిర్మించాం. 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పనులు కూడా వైసిపి చెత్త ప్రభుత్వం పూర్తిచెయ్యలేక పోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మిగిలిన పనులు పూర్తి చేసి పేదలకు ఇళ్లు కేటాయిస్తాం. టిడిపి హయాంలో బనవాసి దగ్గర 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయడానికి 96 ఎకరాలు కేటాయించాం. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టును చంపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తాం.

చేనేత క్లస్టర్ ఏర్పాటుచేస్తాం

టిడిపి హయాంలో చేనేత కార్మికులను ఆదుకోవడానికి చేనేత క్లస్టర్ మంజూరు చేస్తే వైసిపి ప్రభుత్వం ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత క్లస్టర్ ఏర్పాటు చేస్తాం. టిడిపి హయాంలో రూ.111 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేసాం. మగ్గం కొనుగోలు కోసం 50 శాతం సబ్సిడీ తో రుణాలు ఇచ్చాం. యార్న్,కలర్, కెమికల్స్ సబ్సిడీ లో అందించాం. ఇప్పుడు అన్ని పధకాలు పరదాల జగన్ రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మగ్గం ఉన్న వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం. టిడ్కో ఇళ్లు అందిస్తాం. పాత పధకాలు అన్ని తిరిగి ప్రారంభిస్తాం. టిడిపి హయాంలో ఎమ్మిగనూరు టౌన్ లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం గుడికల్ గ్రామంలో 95 ఎకరాల్లో ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణ పనులు ప్రారంభించాం. ఆ పనులు ఆపేయడమే కాకుండా ఆ భూముల్ని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు కేశవ. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూములు స్వాధీనం చేసుకొని ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణం చేసి ఎమ్మిగనూరు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. టిడిపి హయంలో ఎమ్మిగనూరు టౌన్ లో  కోట్ల విలువైన స్థలాన్ని వాల్మీకి కమ్యూనిటీ భవనానికి కేటాయించి, భవన నిర్మాణం కోసం నిధులు కూడా ఇచ్చాం. వైసిపి ప్రభుత్వం వాల్మీకి భవనం నిర్మాణాన్ని ఆపేసింది. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాల్మీకి భవనం నిర్మాణం చేస్తాం.

అంబేద్కర్ భవనం, జామియా మసీదు నిర్మిస్తాం

టిడిపి హయాంలో ఎమ్మిగనూరు టౌన్ లో దళితుల కోసం అంబేద్కర్ భవన్ కోసం విలువైన స్థలాన్ని కేటాయించడం జరిగింది. వైసిపి ప్రభుత్వం అంబేద్కర్ భవన్ నిర్మాణాన్ని ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ భవన్ నిర్మాణం చేస్తాం. టిడిపి హయాంలో ఎమ్మిగనూరు లో జామియా మసీదు కోసం 30 లక్షల రూపాయలు కేటాయించాం. వైసిపి ప్రభుత్వం పనులు ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జామియా మసీదు నిర్మాణం చేపడతాం. రాయలసీమలో పెండింగ్ ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. వాటర్ గ్రిడ్ పథకం పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తాం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మిర్చి, పత్తి, ఉల్లి, టొమాటో రైతులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి వ్యయం తగ్గించి గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత నాది. మీకు అవసరమైన కోల్డ్ స్టోరేజ్ లు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. ఉపాధి లేక ఎంతో మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాకా ఇక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలు దక్కేలా చేస్తాం. టిడిపి కార్యకర్తల పై అక్రమ కేసులు బనాయించి వేధించిన ఎవరిని వదిలి పెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తాం. అక్రమ కేసులు పెట్టిన అధికారులు పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

చేనేత కార్మికులను కలిసి కష్టాలు తెలుసుకున్నలోకేష్

యువగళం పాదయాత్రలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలోని సొసైటీ కాలనీలో చేనేత కార్మికుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మగ్గాలను పరిశీలించి, ప్రభుత్వం నుండి వస్తున్న సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికురాలు కామర్తి జయశ్రీ మాట్లాడుతూ…సొంత మగ్గం లేక కూలీకి వచ్చి చేస్తున్నా.  సొంత మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నుండి రుణాలు కూడా ఇవ్వడం లేదు. ఉచిత విద్యుత్ అందిస్తే బాగుంటుంది. మగ్గంతో వచ్చే కూలీతో ఇళ్లు కూడా గడవడం లేదు.  అందువల్లే బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ పెట్టుకున్నా. క్లస్టర్ ఏర్పాటు చేస్తే సంక్షేమ పథకాలు మాకు నేరుగా అందుతాయి. టీడీపీ హయాంలో 300 వచ్చే విద్యుత్ బిల్లు ఇప్పుడు 800 వస్తోంది. గ్యాస్ ధర, నిత్యవసర సరుకుల ధరలన్నీ విపరీతంగా పెరిగాయి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

గతంలో మేము యార్న్, రంగులు, పట్టుకు సబ్సీడీ ఇచ్చాం.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతల కోసం ఎక్కువ మంది ఉన్నచోట వర్క్ షెడ్లు ఏర్పాటు చేస్తాం. చేనేత ను ఆదుకోవడం కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తాం. మగ్గం ఉన్న చేనేతలకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందిస్తాం. మరమగ్గాలున్న వారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం.  కుల వృత్తులను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది. చేనేతలు అధికంగా ఉన్న ధర్మవరంలో 55 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం పరిహారం రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.  ఆప్కో ద్వారా గతంలో చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి చేనేతలకు ఆదుకున్నాం. చేనేతలకు ఏం చేస్తే బాగుంటుందో నాకు బాగా అవగాహన ఉంది..అధికారంలోకి రాగానే చేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన ఎమ్మిగనూరు లక్ష్మీపేట కాలనీ వాసులు

ఎమ్మిగనూరు లక్ష్మీపేట కాలనీవాసులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా కాలనీలో రోడ్డు సదుపాయం లేదు. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది.  గతంలో ఇచ్చే పెన్షన్లను ప్రభుత్వం తొలగించడంతో ఇబ్బందులు పడుతున్నాం.+టీడీపీ హయాంలో కేటాయించిన ఇళ్లను ఈ ప్రభుత్వం మాకు అందించడం లేదు. కరెంట్ పన్ను, నీటి పన్ను, చెత్త పన్నుల భారం నుండి విముక్తి కలిగించాలి.

లోకేష్ మాట్లాడుతూ…

మున్సిపాలిటీలు, పంచాయితీలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించిన జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది. కొత్తగా పెన్షన్లు ఇవ్వడం చేతగాక కుంటిసాకులతో ఉన్న పెన్షన్లు తొలగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6లక్షల పెన్షన్లను వైసిపి ప్రభుత్వం తొలగించింది. టిడిపి ప్రభుత్వం వచ్చాక అర్హులైనవారికి ఆంక్షలు లేకుండా పెన్షన్లు అందిస్తాం.  టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను వైసిపి ప్రభుత్వం పాడుబెడుతోంది. అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు  ఇళ్లు కేటాయిస్తాం.  రకరకాల పన్నులతో జగన్ రెడ్డి పట్టణ వాసుల నడ్డి విరుస్తున్నారు. అధికారంలోకి రాగానే పన్నుల విధానాన్ని సమీక్షించి సామాన్యులపై భారం తగ్గిస్తాం.

యువనేతను కలిసిన కాంట్రాక్ట్ లెక్చరర్లు

ఎమ్మిగనూరు ఎన్ఆర్ ఫంక్షన్ హాలువద్ద కాంట్రాక్ట్ లెక్చరర్లు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీచేయాలి, పోస్టుల భర్తీలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు వెయిటేజి ఇవ్వాలి. కాంట్రాక్ట్ లెక్చరర్లకు సకాలంలో వేతనాలు అందజేయాలి. జీవో నెంబర్ 77తో  వైసిపి ప్రభుత్వం పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్  రద్దు చేసింది. ఈ జీవో తక్షణ రద్దు చేయాలి. ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలి. విద్యా హక్కు చట్టాన్ని ధిక్కరించి ప్రభుత్వం విడుదలచేసిన జీవో నెంబర్ 84,85,117 జీవోలను రద్దు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2.55 లక్షల పోస్టులు భర్తీ చేయాలి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన  హామీలు అమలు చేయాలి.

యువనేత లోకేష్ మాట్లాడుతూ…

అవగాహనా రాహిత్యంతో రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థను వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. కరోనా సమయంలో జీతాలు ఇవ్వకపోవడంతో ఎంతమంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు సకాలంలో వేతనాలు అందించి, వారి సమస్యలను పరిష్కరిస్తాం. పేద పిజి విద్యార్థులకు గొడ్డలిపోటుగా పరిణమించిన జిఓ నెం.77ని రద్దుచేసి, పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని కొనసాగిస్తాం. లెక్చరర్ పోస్టులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీచేస్తాం. ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మిస్తాం.

యువనేతను కలిసిన ఎస్సీ సామాజికవర్గీయులు

ఎమ్మిగనూరు శ్రీనివాస సర్కిల్ లో ఎస్సీ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. టిడిపి ప్రభుత్వం ఎస్సీల కోసం ప్రవేశపెట్టిన 27 సంక్షేమ పథకాలను వైసిపి ప్రభుత్వం రద్దుచేసింది. వాటన్నింటినీ పునరుద్దరించాలి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర పథకాల మళ్లించకుండా మా సంక్షేమం కోసం మాత్రమే ఖర్చుచేయాలి. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా బ్యాంకు లింకేజి సబ్సిడీ రుణాలను అందించాలి. విదేశీవిద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాలను తిరిగి ప్రవేశపెట్టాలి. ఎస్సీ యువతకోసం నూతన పారిశ్రామిక విధానాన్ని అమలుచేయాలి. ఎన్ఎస్ఎఫ్ డిసి పథకాన్ని ద్వారా స్వయం ఉపాధి రుణాలు అందజేయాలి. పొదుపు గ్రూపు మహిళలకు సబ్సిడీ రుణాలను అందించాలి. చర్మకారులు, డప్పు కళాకారులకు పెన్షన్లు మంజూరుచేయాలి. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు, దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలను తేవాలి. ఎమ్మిగనూరులో అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలి. ఎస్సీ కాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్ ను ఏర్పాటుచేయాలి. ఎమ్మిగనూరులో గత ప్రభుత్వం దళితులకు ఇచ్చిన పట్టాలను పునరుద్దరించాలి. ఎస్సీ స్మశాన వాటికకు 30 అడుగుల రోడ్డు నిర్మించాలి.

యువనేత లోకేష్ మాట్లాడుతూ…

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.33వేల కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి తీరని అన్యాయం చేశారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నించిన దళితులపై దాడులు, హత్యలు నిత్యకృత్యంగా మారాయి. దళిత డాక్టర్లు సుధాకర్, అచ్చెన్నలను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి ప్రభుత్వం రద్దుచేసిన 27 సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తాం. చర్మకారులు, డప్పుకళాకారులకు పెన్షన్లు అందజేస్తాం. ఎమ్మిగనూరులో అంబేద్కర్ భవన్, దళిత శ్మశాన వాటికకు 30అడుగుల సిమెంటు రోడ్డు నిర్మిస్తాం. మీ అందరి సంక్షేమం కోసం పనిచేసే చంద్రన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు మీ వంతు సహకారం అందించండి.

నారా లోకేష్ ను కలిసిన సగర/ఉప్పర కులస్తులు

ఎమ్మిగనూరు సగర, ఉప్పర కులస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సంచార జాతులుగా ఉన్న మమ్మల్ని బిసి-డి నుండి బిసి-ఏ లోకి మార్చాలి. సగరలలో ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నందున, హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని కేటాయించాలి. రోడ్లు భవన నిర్మాణ కాంట్రాక్టు పనుల్లో 33.3 శాతం పనులు టెండర్లు లేకుండా నామినేటెడ్ విధానంలో కేటాయించాలి. పనుల నిర్వహణనకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాలి. గత ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా సగర మహిళలకు రుణాలిచ్చింది.. కానీ ఈ ప్రభుత్వం రుణ సదుపాయం కల్పించలేదు.  గతంలో మా సగరలకు ఇంటి స్థలాల కోసం ఒకేచోట 20 ఎకరాలు కేటాయించి, కట్టుకోవడానికి రుణాలు కూడా ఇచ్చింది. ఈ ప్రభుత్వంలో అక్కడ ఎలాంటి పనులూ జరగడం లేదు. మాకు ఇచ్చిన స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, ఇళ్ల నిర్మాణానికి సహకారం అందజేయండి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసిన ఘనత టీడీపీదే. బీసీ– ఏ కేటగిరీకి మార్పుపై గత నివేదిలను అధ్యయనం చేసి, సానుకూల నిర్ణయం తీసుకుంటాం. భవన నిర్మాణ కార్మికులుగా సగరులు ఎక్కకువగా ఉన్నారు.. ప్రమాదంలో మృతిచెందిన వారికి చంద్రన్న బీమా వర్తింపజేస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక సగరులకు కేటాయించిన స్థలంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. దామాషా ప్రకారం సగరులకు నిధులు కేటాయిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన వాల్మీకి ప్రతినిధులు

ఎమ్మిగనూరు వాల్మీకి సర్కిల్ లో వాల్మీకి బోయలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. వాల్మీకీలను ఎస్టీల్లో చేర్చుతామని చెప్పి వైసిపి ప్రభుత్వం మోసం చేసింది.  వాల్మీకీలను ఎస్టీగా గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలి.  వాల్మీకీ జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించి, సెలవు మంజూరు చేయాలి. ఎస్టీ హోదా వచ్చేలా పార్లమెంట్ లో పోరాడాలి. శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాల్మీకీలకు ప్రాధాన్యం కల్పించాలి.  ఎమ్మిగనూరులో కమ్యూనిటీ హాల్ నిర్మించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

వాల్మీకీలను ఎస్టీల్లో చేర్చుతామన్న వాగ్దానాన్ని జగన్ విస్మరించాలి. రాయలసీమలోని వాల్మీకీలను మాత్రమే ఎస్టీల్లో చేర్చాలని వైసిపి ప్రభుత్వం తప్పుడు తీర్మానం చేసింది. సత్యపాల్ కమిటీ నివేదికమేరకు వాల్మీకిలను న్యాయం చేస్తాం. వాల్మీకి జయంతిని రాష్ట్రప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహిస్తాం. వాల్మీకిలకు రాజకీయంగా మేలు చేసేది టీడీపీ మాత్రమే.  ఎమ్మిగనూరులో వాల్మీకి భవన నిర్మాణాన్ని చేపడతాం.

నారా లోకేష్ ను కలిసిన పిడిఎస్ యు విద్యార్థి సంఘనేతలు

ఎమ్మిగనూరు ఎస్ బిఐ సర్కిల్ వద్ద పిడిఎస్ యు విద్యార్థి సంఘాల నేతలు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి చేస్తానని చెప్పి నేటికీ పూర్తిచేయలేదు. బిసి, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో ఎటువంటి పనులు ప్రారంభించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. పీజీ విద్యార్థులకు చదువు దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. ఎయిడెడ్ విద్యాసంస్థల చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ అమలుచేయాలి. ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలి. ప్రాథమిక విద్యను నాశనం చేసే జీవో నెంబర్ 84, 85, 117 జీవోలను రద్దు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2.55 లక్షల పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన  హామీలు అమలు చేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

నాడు – నేడు పనుల్లో వైసీపీ నేతలు పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పాలిట వరంగా ఉన్న బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లను ఈ ప్రభుత్వం రద్దు చేసింది.  టీడీపీ రాగానే బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లను ప్రవేశపెట్టడంతో పాటు, హాస్టళ్లను వేగంగా నిర్మిస్తాం. జిఓ నెం.77ని రద్దుచేసి పాత ఫీజు ఎంబర్స్ మెంట్ విధానాన్ని ప్రవేశపెడతాం. ప్రతిఏటా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని జగన్ రెడ్డి ఇచ్చిన హామీని మర్చి పోయారు.  టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతిఏటా జాబ్ క్యాలండర్ ఇస్తాం.

Also, read this blog: Shaping Lives and Building Futures by Yuvagalam

Tagged#LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *